గీత-ఖురాన్-బైబిల్.. ఏం చెప్పినా..చివరి సారాంశం మాత్రం.. దేహాన్ని ఆరోగ్యంగా కాపాడుకుంటూ.. భగవంతునివైపు దృష్టి పెట్టి.. ఆఖరుకు భగవంతుడిని చేరుకునే మార్గాన్ని అన్వేషించాలనే. అంతే తప్ప.. ఈ దేహాన్ని కృశింపజేసుకుని.. భగవంతుడిని చేరాలని ఏ గ్రంధం కూడా బోధించలేదు. మధ్యలో ఉన్న ఉపవాస నియమాలు.. ఆయా కాలాలను బట్టి.. దేహాన్ని రిపేర్ చేసుకునేందుకు ఉపయోగపడతాయని కూడా పెద్దలు చెబుతారు. అంతేకాదు.. భగవంతుడిని చేరుకునేందుకు సన్మార్గం.. దైవ చింతన.. నీతి నియమాలకు పెద్దపీట వేయడమే ప్రధాన మార్గమని కూడా బోధిస్తారు.
అయితే.. దీనికి విరుద్ధంగా ఓ పాస్టర్… చేసిన ప్రబోధం.. వందల మందిని మృత్యు కూపంలోకి నెట్టేసింది. ఆహారం తినకుండా తీవ్రమైన ఆకలి, కఠిన ఉపవాసంతో మరణిస్తే జీసెస్‌ను కలిసే అదృష్టం వస్తుందని కెన్యా దేశంలోని ఓ చర్చి పాస్టర్ పాల్ మెకంజీ చేసిన ప్రబోధం అక్కడి వారుగుడ్డిగా నమ్మారు. దీంతో ఆయనను అనుసరించారు. కానీ, ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన మాటలు నమ్మిన వారు మాత్రం కఠిన ఉపవాసాలతో కొద్ది వారాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా అలజడి రేపుతోంది.
ఇప్పటి వరకు 200 మందికిపైగా ప్రాణాలు తీసుకొన్నారని కెన్యా అధికారులు తెలిపారు. గత నెల నుంచి అధికారులు కెన్యాలోని షకహోలా అటవీ ప్రాంతంలో మృతదేహాలను గుర్తిస్తూనే ఉన్నారు. శనివారం ఏకంగా 22 మృతదేహాలు బయటపడ్డాయి. వీరంతా ఆహారం తీసుకోకుండా ప్రాణాలు విడిచినట్లు నిర్ధారించారు. మరో 600 మంది జాడ తెలియడం లేదని చెప్పారు. వీరంతా ఎక్కడో రహస్య ప్రాంతంలో నిరాహారదీక్ష చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
ఎవరీ పాల్?
పాల్ మెకంజీ తనను తాను దైవ దూతగా ప్రచారం చేసుకున్నారు.
2019లో పాల్ మెకంజీ అనే చర్చి పాస్టర్ ఈ అటవీ ప్రాతంలోని కిలిఫీ అనే చోట 800 ఎకరాల్లో విస్తరించిన ప్రాపర్టీలో మకాం వేశా డు. గతంలో మెకంజీ చర్చిలో చిన్నారులు మృతి చెందడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత అతను అడవిలోకి మకాం మార్చాడు. అతడి అనుచరులు కూడా అడవిలోకి వెళుతుండటంతో స్థానికులకు అనుమానం వచ్చి అధికారులను అప్రమత్తం చేశారు.ఈ క్రమంలోనే నిరాహార దీక్షలు.. మృతుల విషయం వెలుగు చూసింది.
ప్రభువును చేరుకునేందుకు కఠిన ఉపవాసాలు చేయాలన్న మెకంజీ పిలుపుతో చాలా మంది ఆహారం తినక, గొంతు నొప్పి వల్ల ప్రాణాలు కోల్పోయినట్లుఅధికారులు గుర్తించారు. కొన్ని మృతదేహాల్లో శరీర భాగాలు కూడా అదృశ్యమైనట్లు కనుగొన్నారు. మెకంజీ భార్య సహా 16 మందిని అదుపులోకి తీసుకొని గత నెల కోర్టులో ప్రవేశపెట్టారు. దాదాపు 610 మంది మిస్సయినట్లు కోస్ట్ రీజియన్ కమిషనర్ రోడ వెల్లడించారు. అంతేకాదు.. అధికారులు దాడులు చేసి చాలా మంది బాధితులను విడిపించారు. మొత్తానికి మత మౌఢ్యంతో పాటు కుట్ర కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
This post was last modified on May 15, 2023 8:07 am
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…