ప్రపంచ క్రికెట్లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉన్న ప్రాధాన్యం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దశాబ్దాలుగా ఇది క్రేజీయెస్ట్ క్రికెట్ మ్యాచ్‌గా ఉంటోంది. అందులోనూ రెండు దేశాల మధ్య దశాబ్దంన్నరగా ద్వైపాక్షిక క్రికెట్ ఆగిపోవడంతో.. ఐసీసీ టోర్నీల్లో ఈ రెండు జట్లు తలపడితే క్రికెట్ ప్రపంచమంతా కళ్లప్పగించి చూస్తోంది.
ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ అభిమానులనే కాక ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఆ మ్యాచ్ అంటే టీవీల ముందు కూలబడిపోతారు. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో తలపడ్డాక రెండు జట్ల మ్యాచ్ మరొకటి రాలేదు. ఈ ఏడాది ఆసియా కప్ టోర్నీ మీద సందిగ్ధత కొనసాగుతుండగా.. ఆ తర్వాత వన్డే ప్రపంచకప్‌లో మాత్రం రెండు జట్ల మ్యాచ్ మీద ఒక క్లారిటీ వచ్చేసింది. అక్టోబరు 15న ఈ మెగా మ్యాచ్ జరగబోతోంది.
అక్టోబరు మొదటి వారంలో ప్రపంచకప్ మొదలు కానుండగా.. ఒకే గ్రూప్‌ల ఉన్న భారత్, పాకిస్థాన్ 15న ముఖాముఖి తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ ఏ స్టేడియంలో జరుగుతుందనే విషయంలో క్లారిటీ లేదు. ఏదైనా పెద్ద సిటీలో ప్రముఖ స్టేడియంలోనే మ్యాచ్ ఉండబోతోంది. ఇక ఈ మెగా టోర్నీ ఫైనల్ వేదిక కూడా ఖరారైపోయింది. పునర్నిర్మాణం తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా అవతరించిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ మైదానం ఫైనల్‌కు వేదికగా నిలవనుంది.
టోర్నీలో మరికొన్ని మ్యాచ్‌లకు కూడా ఈ వేదిక ఆతిథ్యం ఇవ్వబోతోంది. చివరగా 2011లో సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిచింది. మళ్లీ భారత్ వేదికగా జరగనున్న మెగా టోర్నీలో మరోసారి టైటిల్ గెలుస్తుందని అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు.
This post was last modified on May 11, 2023 9:10 am
నిన్న విడుదలైన అన్ స్టాపబుల్ 4 ఎపిసోడ్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ కోసం రామ్…
వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ రెడ్డి గురువారం సీఎం నారా చంద్రబాబునాయుడుకు ఓ లేఖ రాశారు. ఈ…
‘బాహుబలి: ది బిగినింగ్’కు పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసినపుడు బాలీవుడ్ నుంచి మంచి సపోర్టే లభించింది. కరణ్ జోహార్…
తిరుమల తోపులాట ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటనపై ఏపీలోని కూటమి ప్రభుత్వం వేగంగా స్పందించింది. బుధవారం విశాఖ పర్యటనకు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు… దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల…
అభిమానులు ఆతృతగా ఎదురు చూసిన అన్ స్టాపబుల్ 4 నుంచి బాలకృష్ణ - రామ్ చరణ్ ఎపిసోడ్ నిన్న సాయంత్రం…