అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. కాలిఫోర్నియాలో శనివారం సాయంత్రం స్థానిక టెక్సాస్ మాల్‌లో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో టీనేజీ యువతి సహా 9 మంది చనిపోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. కాల్పులకు తెగబడ్డ దుండగుడు ఎందుకు అలా చేశాడనేది మాత్రం తెలియలేదు. అయితే.. కాల్పుల సమాచారం తెలుసుకున్న పోలీసులు.. రంగంలోకి దిగారు.
దుండగుడిని వెంబడించిన పోలీసులు అతనిని కాల్చిచంపారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అలెన్ పోలీసులు పేర్కొన్నారు. టెక్సాస్ పరిధిలోని అలెన్ ప్రాంతంలో.. అలెన్ ప్రీమియం అవుట్‌లెట్స్ మాల్‌లో ఈ ఘటన చోటు చేసుకుందని సీటీ పోలీస్ చీఫ్ బ్రియాన్ హార్వే వెల్లడించారు.
ఇక ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. మాల్ నుంచి బయటకు వస్తున్న వందలాది మందిపై దుండగుడు తనతో పాటు తెచ్చుకున్న తుపాకీతో ఒక్కసారిగా కాల్పులకు తెగబడినట్లు గుర్తించారు. అయితే.. కొందరు కాల్పుల నుంచి తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ విచారం వ్యక్తం చేశారు.
దీనిని దారుణంగా పేర్కొన్నారు. ఈ కాల్పులను “మాటల్లో చెప్పలేని విషాదం”గా అభివర్ణిస్తూ, స్థానిక అధికారులకు అవసరమైన ఏదైనా సహాయం అందించడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. కాగా, యునైటెడ్ స్టేట్స్‌లో సామూహిక కాల్పులు ఇటీవల సర్వసాధారణంగా మారాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు కనీసం 200 ఘటనలు చోటు జరిగినట్టు గన్ వయోలెన్స్(తుపాకీ విధ్వంసాలు) అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు.. దేశంలో తుపాకీ సంస్కృతిని నిషేధించాలన్న బిల్లు చట్టసభలోనే మూలుగుతుండడం గమనార్హం.
This post was last modified on May 7, 2023 12:00 pm
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…