పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఇప్పుడు మామూలు ఊపులో లేడు. కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి మూణ్నాలుగు చిత్రాలను లైన్లో పెట్టి ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేస్తున్నాడు. ఐతే మిగతా చిత్రాలతో పోలిస్తే ముందుగా మొదలై.. అభిమానులు ఎక్కువ అంచనాలు పెట్టుకున్న ‘హరి హర వీరమల్లు’ సంగతే ఎటూ తేలకుండా ఉంది. ఈ చిత్రం రెండేళ్ల కిందట్నుంచి మేకింగ్ దశలోనే ఉంది. దీని తర్వాత మొదలైన సినిమాలు ఒక్కొక్కటిగా పూర్తవుతున్నాయి. ఒకటి ఆల్రెడీ రిలీజైంది. ఇంకొకటి విడుదలకు ముస్తాబవుతోంది.
ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఇంకో రెండు సినిమాలు కూడా ‘హరిహర..’ కంటే ముందు వచ్చేస్తాయేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువ శ్రమ లేకుండా, తక్కువ డేట్లతో అయిపోయే సినిమాలకే పవన్ ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇది ‘హరిహర..’ దర్శక నిర్మాతలు క్రిష్, ఏఎం రత్నంలను కలవరపాటుకు గురి చేస్తోంది.
పరిస్థితి చూస్తుంటే.. 2024 ఎన్నికలకు ముందు ఈ సినిమాకు అవసరమైనన్ని డేట్లు పవన్ ఇచ్చి పూర్తి చేసి, రిలీజ్‌కు సిద్ధం చేయడం కష్టమే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పరిధి కొంచెం ఎక్కువే ఉన్న కథను రెండు భాగాలు చేసి రిలీజ్ చేద్దాం అనే ప్రతిపాదనపై క్రిష్, రత్నం సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా షూట్ చేసిన సినిమాకు ఒక మెరుపు లాంటి ముగింపును ఇచ్చి.. వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేద్దామని.. 2024 ఎన్నికల తర్వాత సెకండ్ పార్ట్ సంగతి చూద్దామని అనుకుంటున్నారట.
కాకపోతే క్రిష్‌కు ఈ రెండు భాగాల సెంటిమెంటు కొంచెం టెన్షన్ పెట్టేదే. ‘యన్.టి.ఆర్’ను ఇలాగే ఒక సినిమాగా మొదలుపెట్టి మధ్యలో రెండు చేశారు. అది ఎటూ కాకుండా పోయింది. బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం ఎదురైంది. క్రిష్ ఇలాంటి సెంటిమెంట్లను పట్టించుకునే టైపులా కనిపించడు కానీ.. ఎంతో రిస్క్ చేసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న రత్నం, చుట్టూ ఉన్న వాళ్లు దీనికి భయపడొచ్చు. మరి రెండు భాగాల విషయంలో తుది నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on May 6, 2023 10:43 am
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…
ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా…