థాయ్ ల్యాండ్ లో గ్యాంబ్లింగ్ ఆడటం పూర్తిగా నిషిద్ధం. థాయ్ లోని బ్యాంకాక్, పట్టాయా అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రాలన్న విషయం అందరికీ తెలిసిందే. పై రెండు ప్రాంతాల్లో క్యాసినోల రూపంలో గ్యాంబ్లింగ్ పెద్ద ఎత్తున జరుగుతుంటుంది. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న లాటరీలు తప్ప ఇంకే విధమైన జూదాన్ని థాయ్ చట్టాలు అనుమతించవు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న గ్యాంబ్లింగ్ మొత్తం అనధికారికంగా జరుగుతున్నదే.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే గ్యాంబ్లింగ్ ఆడుతు పట్టుబడితే నిర్వాహకులతో పాటు ఆడుతూ దొరికిన వాళ్ళకు కూడా కఠినశిక్షలు తప్పవు. గతంలో క్యాసినోలు నిర్వహించిన సందర్భాల్లో పోలీసులు దాడులుచేసి అరెస్టులు చేసిన సందర్భాలున్నాయి. అప్పట్లో వాళ్ళకి థాయ్ కోర్టులు చాలా పెద్ద శిక్షలు విధించిన ఘటనలున్నాయి. ఇపుడిదంతా ఎందుకంటే సోమవారం గ్యాంబ్లింగ్ ఆడిస్తు చికోటి ప్రవీణ్ తో పాటు 93 మంది పట్టుబడ్డారు కాబట్టే.
తెలుగు రాష్ట్రాల్లో చికోటి ప్రవీణ్ అంటే పెద్ద గ్యాంబ్లర్ అన్న విషయం తెలియని వారుండరు. అందుకే ఇపుడు థాయ్ లో క్యాసినోల నిర్వహణపై పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. 1935లోనే అక్కడ గ్యాంబ్లింగ్ ను నిషేధించారు. అందుకనే అనధికారికంగా సెల్లార్లలోను, హోటళ్ళల్లోను, రిసార్టుల్లోను, ప్రైవేటు పార్టీల్లోను క్యాసినోలను నిర్వహిస్తుంటారు. ఇపుడు చికోటి కూడా సెవన్ స్టార్ హోటల్లోని కన్వెన్షన్ హాళ్ళను అద్దెకు తీసుకున్నారు.
థాయ్ చట్టాల ప్రకారం గ్యాంబ్లింగ్ ఆడుతు పట్టుపడితే భారీ జరిమానాలు తప్పవు. అలాగే ఒక్కోసారి యావజ్జీవ శిక్షలు కూడా పడతాయి. మొదటిసారి గ్యాంబ్లింగ్ ఆడుతున్నారని అనిపిస్తే దొరికిన వాళ్ళకి పోలీసులు ఫైన్ వేసి, కౌన్సిలింగ్ చేసి వార్నింగ్ ఇచ్చిన వదిలేస్తారు. ఇపుడు జరిగిందిదే. పట్టుబడ్డ 93 మందిలో 83 మంది తెలుగువాళ్ళే. చికోటితో పాటు మరో ఆరుగురిని మాత్రమే పోలీసులు అరెస్టుచేశారు. మిగిలిన 78 మందికి పోలీసులు కౌన్సిలింగ్ చేసి, ఫైన్ కట్టించుకుని వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టేశారు. బహుశా వీళ్ళల్లో ఎక్కువమంది మొదటిసారి పటాయాకు వచ్చుంటారే. అందుకనే వదిలిపెట్టారు. చికోటి తదితరులు రెగ్యులర్ గా పట్టాయాకు వస్తున్నట్లు వాళ్ళ పాస్ పోర్టులను బట్టి అర్ధమయ్యుంటుంది. అందుకనే అరెస్టు చేసింది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.
This post was last modified on May 2, 2023 2:38 pm
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…