రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్.. భారత ప్రజల మనోభావాలు దెబ్బతీసే పనికి ఒడిగట్టింది. హిందువులు ఆరాధించే కాళీమాత ఫొటోను అభ్యంతరకరమైన రీతిలో పోస్ట్ చేసింది. కాళీమాతను హాలీవుడ్ నటి మార్లిన్ మన్రోతో పోల్చుతూ రెండు ఫొటోలను ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. తొలి ఫొటోలో బాంబు దాడి అనంతరం సంభవించే అగ్ని, దట్టమైన పొగ దృశ్యాలున్నాయి. మరో ఫొటోలో దట్టమైన పొగంతా స్కర్టి.. అగ్ని అంతా జుత్తుగా మారిపోయినట్లుగా ఉన్న కాళీమాత ఫొటో ఉంది.
నాలుక బయటకు తెరిచి.. పుర్రెలను మాలగా వేసుకున్న కాళీమాత ఫొటో చూస్తే మార్లిన్ మన్రోయే స్ఫురణకు వచ్చేవిధంగా అభ్యంతరకరంగా ఉంది. పైగా ఈ ఫొటోల కింద కళానైపుణ్యం అనే అర్థంలో ‘వర్క్ ఆఫ్ ఆర్ట్ అనే క్యాప్షన్ పెట్టారు. ఈ ఫొటోపై హిందూత్వ వాదులు భగ్గుమన్నారు. కాళీమాతను అభ్యంతరకరమైన రీతిలో చిత్రీకరించడం అంటే తమ ధార్మిక భావాల మీద దాడి చేసి అవమానించడమేనని కన్నెర్ర చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఉక్రెయిన్ తీరుకు నిరసనగా పోస్టులు వెల్లువెత్తాయి.
‘హిందువుల విశ్వాసాలపై హాస్యం తగదు. ఈ పోస్టును ఉక్రెయిన్ తక్షణమే ఉపసంహరించుకోవడమే కాదు.. హిందువులకు క్షమాపణలూ చెప్పాలి’ అని మోనికా వర్మ అనే యువతి ట్విటర్ వేదికగా వ్యాఖ్యానించారు. ‘రష్యా బాధిత దేశంగా చెప్పుకొంటున్న ఉక్రెయిన్, కాళీమాతను ఇలా అభ్యంతరకమైన రీతిలో చిత్రీకరించడం మానుకొని, దుష్టశక్తులపై విజయం కోసం ఆమె ఆశీర్వాదం కోరాలి’ అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. కొందరైతే ఉక్రెయిన్పై భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. సర్వత్రా విమర్శలు రావడంతో ఉక్రెలు ఎన్ రక్షణ మంత్రిత్వశాఖ కాళీమాత ఫొటోను పోస్ట్ చేసిన కొద్దిసేపటికే డిలీట్ చేసింది. అయితే, దీనిపై భారత్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ రాయబారికి సమన్లు జారీ చేసింది.
This post was last modified on May 1, 2023 11:22 am
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…
ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా…