చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బ్యూటీ పార్లర్‌కు వెళ్లొద్దు అని చెప్పిన భర్త మాట ఆ భార్యకు చేదుగావినిపించింది. అంతే.. వెంటనే ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్లో జరిగింది.
బ్యూటీ పార్లర్కు వెళ్లొద్దని చెప్పినందుకు.. ఆత్మహత్య చేసుకుంది ఓ మహిళ. భర్త భయటకు వెళ్లిన సమయంలో సీలింగ్కు ఉరివేసుకొని చనిపోయింది. అనంతరం ఇంటికి వచ్చిన భర్త.. విగతజీవిగా ఉన్న భార్యను చూసి కన్నీరు మున్నీరయ్యాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
బల్రాం యాదవ్, రీనా యాదవ్ (34) భార్య భర్తలు. వీరిద్దరు ఏరోడ్రోమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్కీమ్-51లో నివాసం ఉంటున్నా రు. వీరికి 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. తరచుగా చిన్న చిన్న విషయాలపై ఘర్షణ పడుతున్నారు. అయితే.. ఎప్పటికప్పుడు ఇద్దరూ కూడా సర్దుకుపోతున్నారు. అయితే.. గురువారం రీనా.. భర్త బల్రాంను బ్యూటీ పార్లర్కు వెళ్తానని అడగగా.. అతడు తిరస్కరించాడు.
దీంతో రీనా కోపంగా గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. కొద్దిసేపటికి బలరాం తిరిగొచ్చాడు. భార్యను పిలిచాడు బలరాం. గది నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అనుమానం వచ్చి తలుపుతెరిచి చూస్తే, రీనా ఉరి వేసుకొని కనిపించింది. భర్త ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవపరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates