అవును.. వీడు మామూలోడు కాదు. ఏకంగా ముఖ్యమంత్రికే మస్కా కొట్టేశాడు. నిఘా విభాగం ఏం చేస్తుందో కానీ అంత జరిగిపోయిన తర్వాత అసలు విషయం బయటకువచ్చి అవాక్కు అయ్యేలా చేసింది. తాజాగా ఈ పరిణామం తమిళనాడులో చోటు చేసుకుంది. తనకుతాను వీల్ ఛైర్ క్రికెట్ కెప్టెన్ గా పరిచయం చేసుకోవటమే కాదు.. ఈ మధ్యనే ప్రపంచకప్ ను సాధించినట్లుగా బిల్డప్ ఇచ్చి.. ముఖ్యమంత్రిగా ఫోటోలు దిగిన మాయగాడి ఉదంతమిది.
రామనాథపురం జిల్లా కడలాడి తాలూకాకు చెందిన వినోద్ బాబు దివ్యాంగుడు. భారత వీల్ ఛైర్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా తనను తాను పరిచయం చేసుకుంటూ మోసాలకు పాల్పడుతుంటాడు. 2022లో తాను కెప్టెన్ గా వ్యవహరించిన జట్టు ఆసియా కప్ ను గెలిచినట్లుగా తమిళనాడు మంత్రులు రాజకన్నప్పన్.. ఉయనిధి స్టాలిన్ ను కలిశారు. అంతేకాదు.. లండన్ లో జరిగిన టీ20ప్రపంచ కప్ ను గెలిచామని తాజాగా ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిశారు.
అయితే.. వినోద్ బాబు చెప్పేవన్నీ అబద్ధాలుగా చెన్నై సచివాలయానికి సమాచారం అందింది. దీనిపై నిఘా వర్గాలు దర్యాప్తు చేయగా.. దొంగ మాటలు చెబుతూ వినోద్ బాబు మోసాలకు పాల్పడుతుంటాడే కానీ.. అసలు జట్టులోనే లేడన్న విషయాన్ని ధ్రువీకరించుకున్న అధికారులకు దిమ్మ తిరిగిపోయింది. వినోద్ బాబుకు అసలు పాస్ పోర్టు కూడా లేదన్న విషయాన్ని తాజాగా గుర్తించారు.
ఇప్పటికే మాయమాటలతో పలువురిని మోసం చేసిన చరిత్ర అతనికి ఉందని గుర్తించారు. అతడి మాటల్ని నమ్మి పలువురు మంత్రులు..రాజకీయ నాయకులు ఆర్థిక సాయాన్ని అందించినట్లుగా గుర్తించారు. దీంతో.. ఉలిక్కిపడ్డ అధికారులు నిందితుడిపై తాజాగా కేసు నమోదు చేసి.. అతన్ని అదుపులోకి తీసుకునే పనిలో పడ్డారు. మోసాలు చేసేటోడు.. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి సైతం మస్కా కొట్టిన వైనం తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది.
This post was last modified on April 29, 2023 11:15 am
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…
ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా…