ఒక్క భార్యతోనే వేగలేకపోతున్నాం.. అని తలపట్టుకునే భర్త పుంగవులకు.. కళ్లు తెరిపించే ఘటన వెలుగు చూసింది. ఏకంగా.. ఒక భర్తకు 40 మంది భార్యలు ఉన్నారు. వారికి పిల్లలు కూడా పుట్టారు. ఎవరిని అడిగినా.. తమ భర్త పేరు ఒక్కటే అని చెబుతున్నారు. మొత్తం 40 మందీ ఇదే పాట పాడుతున్నారు. మరి ఆ 40 మంది భార్యలు.. ఒక్కగానొక్క భర్త కథేంటి? ఎక్కడ వెలుగు చూసింది.. అనేది దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
బిహార్‌లోని నితీష్‌కుమార్ ప్రభుత్వం కొన్నాళ్లుగా కుల గణన చేపడుతోంది. అంటే.. ఏయే కులాల వారు ఎంతెంత మంది ఉన్నారు.. వారికిప్రభుత్వం అందించే రాయితీలు.. పథకాలు అందుతున్నాయా? లేదా? వంటి విషయాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో అధికారులు రాష్ట్రం మొత్తం తిరిగి.. వివరాలు సేకరిస్తున్నారు. ఇలానే అర్వల్ జిల్లాలోని ఓ రెడ్ లైట్ ఏరియాకు వెళ్లి సమాచారం సేకరించారు. అక్కడ నివాసం ఉండే మహిళలు చెప్పిన సమాధానాలు ఆశ్చర్యానికి గురిచేశాయి.
దాదాపు 40 మంది మహిళలు.. తమ భర్తగా ఒక్కరి పేరే చెప్పారు. దీంతో అక్కడికి వెళ్లిన అధికారులంతా అవాక్కయ్యారు. చాలా మంది పిల్లలు కూడా తమ తండ్రిగా.. అతని పేరే చెప్పారు. ఓ రెడ్లైట్ ఏరియాకు అధికారులు వెళ్లారు. అక్కడ వివరాలు సేకరిస్తుండగా.. దాదాపు 40 కుటుంబాలు తమ భర్త కాలమ్లో రూప్చంద్ అనే పేరు నమోదు చేసుకున్నాయి. వారంతా కలిసి ఒకే పేరు చెప్పడం వల్ల అనుమానం వ్యక్తం చేసిన అధికారులు.. పూర్తి వివరాలను ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది.
రెడ్లైట్ ఏరియాలో ఓ డ్యాన్సర్ ఉన్నాడు. అతడు చాలా ఏళ్లుగా పాటలు పాడుతూ.. డాన్స్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి అక్కడ సొంత నివాసం కూడా లేదు. అతడిపై అభిమానంతోనే వీరంతా రూప్చంద్ పేరును.. తమ భర్తల పేరుగా వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. వారికి కులం అంటు ఏది లేదని అధికారులు తెలిపారు.