Trends

ఫ్లైట్ లో కొట్టేసుకున్నారు.. అద్దం సైతం విరిగిపోయింది

ఇటీవల కాలంలో విమాన ప్రయాణంలో చోటు చేసుకుంటున్న విపరీతాలు అన్నిఇన్ని కావు. ఎయిర్ హోస్టెస్ మీద వేధింపులు..వారిని ఇబ్బంది పెట్టటం కొత్తేం కాదు. కానీ.. తోటి ప్రయాణికుల మీద మూత్ర విసర్జన చేయటం.. అనుచితంగా ప్రవర్తిస్తున్న వైఖరులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. తాజా ఉదంతంలో అయితే.. ఏకంగా కొట్టేసుకున్న వైనం షాకింగ్ గా మారింది.

ఆస్ట్రేలియాలో వెలుగు చూసిన తాజా ఉదంతం గురించి తెలిస్తే షాక్ తినాల్సిందే. నలుగురు ప్రయాణికుల మధ్య మొదలైన వివాదం అంతకంతకూ పెరగటమే కాదు.. వారి మధ్య ముష్ఠిఘాతాలకు కారణమైంది. ఒకరినొకరు తన్నుకొంటూ.. విమానంలోని వస్తువుల్ని డ్యామేజ్ చేసే వరకు వెళ్లింది. క్యాన్జ్ నుంచి నార్త్ ఆస్ట్రేలియాకు వెళుతున్న విమానంలో ఈ అసాధారణ ఉదంతం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

మొదట ముగ్గురు ప్రయాణికుల మధ్య వివాదం మొదలైంది. అది కాస్తా పెరిగి పెద్దదైంది. ఈ క్రమంలో ఒక మహిళ గాజు సీసాతో మరో ప్రయాణికుడి మీద దాడికి ప్రయత్నించింది. దీంతో ఒకరినొకరు తన్నుకోవటం.. తోసుకోవటం వరకు విషయం వెళ్లింది. విమాన సిబ్బంది ఎంత చెప్పినా వారు ఊరుకోలేదు.అంతకంతకూ గొడవ పెరిగి.. తన్నులాటకు వెళ్లటంతో తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

ఈ నేపథ్యంలో విమానాన్ని గమ్యస్థానం వరకు వెళ్లకుండా దగ్గర్లోని ఎయిర్ పోర్టుకు తీసుకెళ్లారు. అలా క్వీన్స్ ల్యాండ్ కు వెళ్లిన విమానం.. గొడవ సద్దుమణిగాక మళ్లీ టేకాఫ్ అయ్యింది. కానీ.. వారి మధ్య మళ్లీ గొడవ రాజుకుంది. ఈసారి గొడవ మరింత పెరిగి పెద్దది కావటమే కాదు.. విమాన కిటికీ అద్దం పగలటంతో పాటు.. కొన్ని వస్తువులు కూడా విరిగిపోయాయి. దీంతో హడలిపోయిన సిబ్బంది.. వారిని సముదాయించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ.. ఫలితం లేకుండా పోయింది. దీంతో.. విమానం గమ్యస్థానానికి చేరుకున్నంతనే నలుగురు ప్రయాణికుల్ని పోలీసులు అరెస్టు చేశారు. గొడవ పడిన ప్రయాణికుల్లో ఒకరి వద్ద నుంచి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విమాన ప్రయాణం మిగిలిన ప్రయాణికులకు పీడకలగా మారిందన్న మాట వినిపిస్తోంది.

This post was last modified on April 27, 2023 5:51 pm

Share

Recent Posts

ట్విస్టులు ఆర్టిఫీషియల్ ఉంటే ఎలా

హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…

33 seconds ago

దాదా వెనక్కు తగ్గే ఉద్దేశంలో లేడా?

షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…

22 minutes ago

రిలేషన్ సరే… కంటెంట్ రివీల్ చేయండి

దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…

44 minutes ago

కారు బానెట్‌ పై ఇల్లాలు… కారు లోపల ప్రియురాలు

భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…

2 hours ago

కుటుంబం సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి

నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…

3 hours ago

రాజమౌళి రాబోయే ‘ట్రబుల్’ని గుర్తించలేదా

స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…

3 hours ago