హైదరాబాద్ కు చెందిన ఇద్దరు యువకులు అనూహ్యరీతిలో మరణించారు. గుర్రాన్ని కాపాడే క్రమంలో వారు ప్రాణాలు కోల్పోయారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని కిషన్ బాగ్ కు చెందిన అజం అనే వ్యక్తి కిస్మత్ పూర్ లో గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తుంటాడు. అజం అన్న కొడుకు సైఫ్ అతడికి సాయం చేస్తుంటాడు. ఒకట్రెండు రోజుల క్రితమే రాజస్థాన్ కు చెందిన అశీష్ సింగ్ అనే యువకుడు వారి వద్ద పనికి చేరాడు.
ఇదిలా ఉంటే బుధవారం సాయంత్రం గుర్రాన్ని ఈసా నదికి తీసుకెళ్లారు. వేసవి తాపాన్ని తట్టుకోలేని గుర్రం.. ఈసా నదిలోకి పరుగులు తీసింది. దీంతో.. దాని కళ్లాన్ని పట్టుకున్న అశీశ్ సింగ్ దాంతో నదిలోకి వెళ్లాడు. అనూహ్యంగా గుర్రం నీట మునిగిపోయింది. దాన్ని బయటకు లాగేందుకు ప్రయత్నించిన అశీష్ సింగ్ గుర్రంతో పాటు నీట మునిగాడు. వీరిని రక్షించేందుకు సైఫ్ నదిలోకి దిగాడు. అయితే.. అతను సైతం నీట మునిగిపోయాడు.
వీరిని గుర్తించిన స్థానికులు గుర్రం శిక్షణ కేంద్రం నిర్వాహకుడు అజంకు సమాచారం ఇవచ్చారు. వారు గుర్రంతోపాటు నీట మునిగిన ఇద్దరిని రక్షించేందుకు ప్రయత్నించారు కానీ సాధ్యం కాలేదు. వారు గల్లంతయ్యారు. దీంతో.. వారిని గుర్తించేందుకు జీహెచ్ఎంసీకి చెందిన గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే గుర్రంతో పాటు అశీష్ సింగ్.. సైఫ్ లు మరణించినట్లుగా తేలింది. గుర్రాన్ని కాపాడే క్రమంలో ఇద్దరు యువకులు మరణించిన వైనం స్థానికంగా విషాదాన్ని నింపింది.
This post was last modified on April 27, 2023 12:30 pm
సంగీత దర్శకుడు తమన్ చూడ్డానికి చాలా సరదా మనిషిలా కనిపిస్తాడు. సోషల్ మీడియాలో తన మీద ఎలాంటి కామెంట్లు పడుతుంటాయో…
గేమ్ ఛేంజర్ పాటల విషయంలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, ఒక కంపోజర్ గా తాను పాతిక నుంచి ముప్పై…
టాలీవుడ్ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి నిండా సమస్యల్లో చిక్కుకుపోయి ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా...…
నితిన్ కెరీర్ లోనే అతి పెద్ద బడ్జెట్ సినిమాగా చెప్పుకుంటున్న రాబిన్ హుడ్ విడుదలకు ఇంకో పది రోజులు మాత్రమే…
టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ సీక్వెల్స్ లో ఒకటి కల్కి 2898 ఏడి. వెయ్యి కోట్ల గ్రాస్ సాధించిన బ్లాక్ బస్టర్…
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినంతనే రాష్ట్రానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. కేవలం 10 నెలల కాలంలోనే ఏపీకి ఏకంగా రూ.7 లక్షల…