మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో ఐటీ కంపెనీలతో సహా పలు దిగ్గజ కంపెనీలు తమ ఖర్చులకు కోత పెట్టుకునే క్రమంలో ఉద్యోగుల్ని ఇంటికి పంపించేస్తున్నారు. గడిచిన రెండేళ్లుగా సాగుతున్న ఈ కోతల పర్వం ఇప్పుడు అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ఇప్పటికే ఈ సంస్థ నుంచి పలువురు ఉద్యోగుల్ని తీసేసిన సంస్థ.. తాజాగా మరో పదివేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లుగా తెలుస్తోంది.
ఖర్చుల్ని అదుపులోకి ఉంచుకోవటంలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. మెటా పరిధిలోనే ఫేస్ బుక్.. ఇన్ స్టా.. వాట్సాప్.. వర్చువల్ రియాలిటీపై పని చేస్తున్నరియాలిటీ ల్యాబ్.. ఇలాంటి తమకున్న అన్ని వ్యాపారాల్లోనూ ఉద్యోగుల సంఖ్యను కోతపెట్టించుకోవటంలో భాగంగా పెద్ద ఎత్తున కోతలు వేస్తున్నారు. ఏ విభాగంలో ఎంతమందిని ఇంటికి పంపాలన్న విషయంపై ఇప్పటికే మేనేజర్ స్థాయిల్లోని వారికి సమాచారం ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
తమ కంపెనీ నుంచి మరింత మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించి వేయనున్నట్లు ఈ మార్చిలోనే జుకర్ బర్గ్ సంకేతాలు ఇవ్వటం తెలిసిందే. గత ఏడాది 11 వేల మందిని తొలగించిన కంపెనీ.. ఇప్పుడు మరో 10 వేల మందిని పంపేందుకు సిద్ధమైంది. లేఆఫ్ ల తర్వాత కొంతమందిని కొత్త ప్రాజెక్టులపై పని చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. ఈ షాక్ ఇలా ఉంటే.. తాజాగా ప్రపంచంలోనే ప్రముఖమైన ఎంటర్ టైన్ సంస్థగా పేర్కొనే వాల్ట్ డిస్నీ సైతం వేలాది మంది ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఎంటర్ టైన్ విభాగంలో దాదాపు పదిహేను శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకురంగం సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే డిస్నీ ఏడు వేల మందిని ఇంటికి పంపించేసింది. తాజా పరిణామాలుచూస్తే.. చుక్క రక్తం కూడా చిందని మహా కోతగా చెప్పాలి.
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…