ఇంకో అయిదు రోజుల్లో మార్చి 31న మొదలుకాబోతున్న ఐపీఎల్ 2023కి సర్వం సిద్ధమయ్యింది. కోట్లాది ప్రేక్షకులు టీవీలకు ఫోన్లకు అతుక్కుపోయి మరీ చూసే ఈ క్రికెట్ సంబరానికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ప్రతి టీమ్ లోనూ అన్ని దేశాల సభ్యులు కలగలిసి ఉండటంతో రాష్ట్రాలు లేదా నగరాల ప్రాతిపదికన అభిమానులు విడిపోయి మద్దతు ఇచ్చుకుంటున్నారు. ఈసారి ఈ మెగా స్పోర్ట్స్ కి స్టార్ అట్రాక్షన్ తోడు కానుంది. నందమూరి బాలకృష్ణ ఇప్పుడీ గేమ్ కోసం కామెంటేటర్ గా వ్యవహరించబోతున్నారు. మాస్ అండ్ బేస్ గొంతుతో బాలయ్య చమక్కులు విసరబోతున్నారు
స్టార్ స్పోర్ట్స్ ప్రత్యేకంగా బాలయ్యతో డీల్ కుదుర్చుకుంది. అన్ని మ్యాచులకు చెబుతారా లేక హైదరాబాద్ ఆడే సన్ రైజర్స్ కు మాత్రమే అందుబాటులో ఉంటారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. స్టార్ నెట్ వర్క్ బాలకృష్ణను గత కొంత కాలంగా బ్రాండ్ గా మార్చేసుకుంది. అఖండ డిస్నీ హాట్ స్టార్ ఓటిటిలో వచ్చాక మిలియన్ల వ్యూస్ తో యాప్ హోరెత్తిపోయింది. అందుకే మైత్రి మూవీ మేకర్స్ సినిమాలన్నీ అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లు కొన్నప్పటికీ వీరసింహారెడ్డిని మాత్రం హాట్ స్టార్ చాలా ఫ్యాన్సీ రేట్ ఇచ్చి ప్రత్యేకంగా బాలయ్య రికమండేషన్ తో సొంతం చేసుకుంది.
ఇప్పుడు ఇలా ఐపీఎల్ కోసం కొత్త భూమికను ఇచ్చింది. స్టార్ హీరోగా అశేష ఫాలోయింగ్ సంపాదించుకున్న బాలయ్య ఆహా అన్ స్టాపబుల్ షోతో యాంకర్ గానూ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇండియన్ ఐడల్ షో కోసం జడ్జ్ గా మారేందుకు ఎస్ చెప్పారు. యాడ్స్ లోనూ నటించారు. ఇప్పుడు కామెంటేటర్ గా కొత్త పాత్రలో ప్రవేశిస్తున్నారు. ఒకపక్క బసవతారకం ఆసుపత్రి అధిపతిగా హిందూపూర్ ఎమ్మెల్యేగా మరోవైపు కోట్ల పెట్టుబడులు పెడుతున్న నిర్మాతల సినిమాల్లో హీరోగా ఈ వయసులోనూ ఇంత కష్టపడటం చూస్తుంటే జై బాలయ్య అనక ఉండగలరా
This post was last modified on March 26, 2023 3:09 pm
సంగీత దర్శకుడు తమన్ చూడ్డానికి చాలా సరదా మనిషిలా కనిపిస్తాడు. సోషల్ మీడియాలో తన మీద ఎలాంటి కామెంట్లు పడుతుంటాయో…
గేమ్ ఛేంజర్ పాటల విషయంలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, ఒక కంపోజర్ గా తాను పాతిక నుంచి ముప్పై…
టాలీవుడ్ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి నిండా సమస్యల్లో చిక్కుకుపోయి ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా...…
నితిన్ కెరీర్ లోనే అతి పెద్ద బడ్జెట్ సినిమాగా చెప్పుకుంటున్న రాబిన్ హుడ్ విడుదలకు ఇంకో పది రోజులు మాత్రమే…
టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ సీక్వెల్స్ లో ఒకటి కల్కి 2898 ఏడి. వెయ్యి కోట్ల గ్రాస్ సాధించిన బ్లాక్ బస్టర్…
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినంతనే రాష్ట్రానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. కేవలం 10 నెలల కాలంలోనే ఏపీకి ఏకంగా రూ.7 లక్షల…