అగ్రరాజ్యం అమెరికాకు ఏమైంది? ఇటీవల సిలికాన్ వాలీ బ్యాంకు సంక్షోభంలో చిక్కుకున్న విషయం ప్రపంచాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక దేశాలు అలెర్ట్ అయ్యాయి. అయితే.. ఈ విషయం నుంచి ఇంకా తేరుకోక ముందుగానే.. ఇప్పుడు మరో బ్యాంకు కూడా సంక్షోభపు అంచులకు చేరుకుని తాళం వేసే పరిస్థితి వచ్చింది. క్రిప్టో పరిశ్రమతో ఎక్కువగా సంబంధాలున్న సిగ్నేచర్ బ్యాంక్ ను మూసివేస్తున్నట్లు తెలిసింది.
సిగ్నేచర్ బ్యాంకును ‘ది ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్‌డీఐసీ)’ తన నియంత్రణలోకి తీసుకుంది. అయితే, బ్యాంకు ఖాతాదారులు తమ నిధులను ఉపసంహరించుకునేందుకు మాత్రం అవకాశం కల్పించారు. దీనికి గాను తాత్కాలికంగా ఓ ‘బ్రిడ్జ్ బ్యాంక్’ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా సిగ్నేచర్ కస్టమర్లు, డిపాజిటర్లు తమ నిధులను విత్ డ్రా చేసుకునే సౌలభ్యం ఏర్పడింది.
సిగ్నేచర్‌కు గత ఏడాది ముగిసే నాటికి 110.36 బిలియన్ డాలర్ల ఆస్తులు, 88.59 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి. సిగ్నేచర్ బ్యాంక్ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తోంది. స్థిరాస్తి, డిజిటల్ అసెట్స్ బ్యాంకింగ్ సహా మొత్తం తొమ్మిది విభాగాల్లో ఈ బ్యాంకు సేవలందిస్తోంది. గత ఏడాది సెప్టెంబరు నాటికి ఈ బ్యాంకు డిపాజిట్లలో మూడో వంతు క్రిప్టో రంగం నుంచి వచ్చినవే. బ్యాంకు ప్రారంభమైన 2001 నుంచి ఎంతో మంది డిపాజిటర్లు ఈ బ్యాంకుకు ఖాతా దారులుగా ఉన్నారు. కానీ, ఇప్పుడు హఠాత్తుగా మూతబడడంతో బ్యాంకు ముందు క్యూ కట్టారు.
This post was last modified on March 13, 2023 3:51 pm
టాలీవుడ్ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి నిండా సమస్యల్లో చిక్కుకుపోయి ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా...…
నితిన్ కెరీర్ లోనే అతి పెద్ద బడ్జెట్ సినిమాగా చెప్పుకుంటున్న రాబిన్ హుడ్ విడుదలకు ఇంకో పది రోజులు మాత్రమే…
టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ సీక్వెల్స్ లో ఒకటి కల్కి 2898 ఏడి. వెయ్యి కోట్ల గ్రాస్ సాధించిన బ్లాక్ బస్టర్…
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినంతనే రాష్ట్రానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. కేవలం 10 నెలల కాలంలోనే ఏపీకి ఏకంగా రూ.7 లక్షల…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత కొంతకాలంగా తన తల్లి వైఎస్ విజయమ్మతో విభేదాలతో సాగుతున్న సంగతి…
పైన ఫొటోలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో కలిసి కనిపిస్తున్న బుడ్డోడి పేరు నంద్యాల సిద్ధార్థ్. వయసు 14 ఏళ్లే.…