ఇంజనీరింగ్ విద్యార్థి.. నవీన్‌ను అతని స్నేహితుడు హరిహర కృష్ణ అత్యంత దారుణంగా హత్య చేసి.. శరీరాన్ని ఖండ ఖండాలుగా నరికి.. మరో స్నేహితుడు హసన్ సాయంతో కాల్చేసిన విషయం తెలిసిందే. అయితే.. కేసులో పోలీసులు తవ్వే కొద్దీ అనేక భయంకర నిజాలు వెలుగు చూస్తున్నాయి. నవీన్ ప్రియురాలు.. తర్వాత హరిహర కృష్ణ ప్రియురాలిగా మారడం నుంచి అసలు కథంతా కూడా ఆమెకు తెలిసే జరిగిందని పోలీసులు వెల్లడించారు.
అంతేకాదు..నవీన్ శరీర భాగాలను కాల్చుతున్న సమయంలో ఆమె దూరం నుంచి చూసిందని.. హత్య జరిగిన తర్వాత.. హరిహర-నీహారిక కలిసి ఓ రెస్టారెంట్‌కు వెళ్లడం, అక్కడ బిర్యానీ తినడం.. హరిహర తప్పించుకునేందుకు డబ్బులు సాయం చేయడం.. ఇలా.. అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో ఇప్పుడు మరో కొత్త ట్విస్టు.. భయంకరమైన మలుపు తిరిగింది. అసలు.. నవీన్‌ను చంపుతాడని అనుకోలేదన్న.. నీహారిక.. దీనికి సంబంధించి బలమైన నిజాన్ని పోలీసులకు వెల్లడించింది.
నీవీన్ ను హత్య చేసేందుకు హరిహర నెల రోజుల ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టు నీహారిక తాజాగా వెల్లడించింది. ఈ విషయం నాకు తెలుసు. నెల రోజుల ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాడు. కానీ, వద్దని వారించాను. నా మాట వినలేదు. పైగా.. నవీన్‌ను హత్య చేసిన వారం రోజులకే నిన్ను తీసుకువెళ్లిపోయి.. పెళ్లి చేసుకుంటానని, నీ మెడలో తాళికడతానని చెప్పాడు అని నీహారిక పోలీసులకు తెలిపింది.
అయితే.. అసలు.. హరిహర పోలీసులకు లొంగిపోవడం వెనుక కూడా పెద్దకథ ఉందని నీహారిక వెల్లడించిం ది. తన బావ(అక్క భర్త) లాయర్ అని.. ఆయనకు విషయం చెబితే రక్షిస్తాడని హరిహరకు సూచించిందట. దీంతో నవీన్ ఆయనను కలిసి.. అంతా వివరించాడు. దీంతో ఆయనే స్వయంగా పోలీసులకు లొంగి పోవాలని.. లొంగిపోతే కేసు తీవ్రత తగ్గుతుందని.. తద్వారా శిక్ష కూడా తగ్గుతుందని.. తాను బయటకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తానని చెప్పినట్టు నీహారిక వెల్లడించింది. దీంతో పోలీసులు ఇప్పుడు సదరు లాయర్‌ను కూడా కేసులో భాగం చేయనున్నట్టు చెబుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని నిజాలు వెలుగు చూస్తాయో చూడాలి.
This post was last modified on March 10, 2023 1:46 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…