దేశంలో చిత్రవిచిత్రమైన కేసులు వెలుగు చూస్తున్నాయి. తన భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో ఓవ్యక్తి ఎలాంటి కేసులు పెట్టకుండా..ఎలాంటి కక్షా సాధించకుండా.. ఏకంగా అతడి భార్యను వివాహం చేసుకున్నాడు. బిహార్లోని ఖగాడియా జిల్లాలో ప్రేమ, పగలతో కూడిన ఓ వింత వివాహాల ఘటన వెలుగు చూసింది. కొంతకాలం తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగించి, చివరకు పెళ్లి చేసుకున్నాడనే ఆగ్రహంతో ఆ వ్యక్తి అతని భార్యను వివాహం చేసుకున్నాడు .
నలుగురు పిల్లల తల్లిని ప్రేమించి..
బిహార్‌లోని ఖగాడియా జిల్లాలోని హర్దియా గ్రామానికి చెందిన నీరజ్.. పస్రాహా గ్రామానికి చెందిన రూబీ దేవిని 2009లో వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లికి ముందు నీరజ్ భార్య పస్రాహా గ్రామానికి చెందిన ముకేశ్ అనే వ్యక్తితో చనువుగా ఉండేది. అది కాస్తా ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది.
అయితే, రూబీ నీరజ్ను వివాహం చేసుకున్న కొన్నాళ్లు ఆమె ప్రియుడికి దూరంగానే ఉంది. మరి మధ్యలో ఏం జరిగిందో ఏమో.. వెంటనే ముకేశ్తో సంబంధాన్ని కొనసాగించింది. మరోవైపు ముకేశ్.. అమ్నీ గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు కూడా రూబీనే కావడం విశేషం. వీరికి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గతేడాది ఫిబ్రవరిలో నీరజ్ భార్య రూబీ దేవి, ముకేశ్లు ఊరు విడిచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు.
ఆయన భార్యను ఈయన!
ఈ విషయం తెలుసుకున్న నీరజ్.. పోలీస్ స్టేషన్‌లో ముకేశ్పై కిడ్నాప్ కేసు పెట్టాడు. ఈ విషయాన్ని గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకెళ్లినా ముకేశ్ తప్పించుకొని తిరుగుతున్నాడని బాధితుడు నీరజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ క్రమంలో తన భార్య రూబీ దేవి, ముకేశ్లపై ప్రతీకారం తీర్చుకునేందుకు నీరజ్ ఏకంగా ముకేశ్ భార్యతో వివాహేతర సంబంధాన్ని ప్రారంభించాడు.
అంతటితో ఆగకుండా ఆమెను ఈ నెల 18న స్థానిక ఆలయంలో కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్నాడు. ఇందులో సరదా విషయమేంటంటే ఇద్దరి భర్తల భార్యల పేర్లు కూడా రూబీనే కావడం. నీరజ్ ప్రముఖ టాటా కంపెనీలో పనిచేస్తుండగా.. ముకేశ్ దినసరి కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఇదీ.. చిత్రం అంటే..!!
This post was last modified on February 28, 2023 11:19 pm
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…