క్రికెటర్ హార్దిక్ పాండ్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడు? అదేంటి విదేశీ అమ్మాయి నటాషా స్టాంకోవిచ్‌ను అతను పెళ్లాడి రెండేళ్లే కదా అయింది. వీరికి ఒక బాబు కూడా పుట్టాడు కదా? భార్యతో అతను చాలా అన్యోన్యంగానే కనిపిస్తున్నాడు కదా?
ఇంతలో మళ్లీ అతడికి పెళ్లేంటి? అంటే నటాషా నుంచి అప్పుడే హార్దిక్ విడాకులు తీసేసుకున్నాడా అని సందేహాలు కలగడం సహజం. కానీ హార్దిక్‌కు మళ్లీ పెళ్లి జరుగుతున్న మాట వాస్తవమే కానీ.. ఆ పెళ్లి వేరే అమ్మాయితో కాదు. నటాషాతోనే. ఇదేం ట్విస్టు అంటారా? అక్కడే ఉంది విశేషం. 2020లో లాక్ డౌన్ టైంలో చాలా తక్కువ మంది సన్నిహితుల మధ్య నటాషాను పెళ్లాడాడు హార్దిక్.
అంతకు కొన్ని నెలల ముందే నటాషాకు బోట్ మీద ఉంగరం తొడిగి ఆమెతో ఎంగేజ్ అయినట్లు ప్రకటించాడు. కానీ పెళ్లి ఎప్పుడు జరిగింది ఏంటన్నది వెల్లడించకుండానే.. తమకు బిడ్డ పుట్టిన విషయాన్ని బయటపెట్టాడు. కరోనా, లాక్ డౌన్ వల్ల పెళ్లి ఘనంగా చేసుకోవడానికి అవకాశం లేకపోయింది.
ఐతే తన పెళ్లి ఘనంగా చేసుకోలేదన్న లోటు హార్దిక్‌ను వెంటాడుతున్నట్లుంది. అందుకే ఈ వీకెండ్లో మళ్లీ నటాషాను బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా మళ్లీ పెళ్లాడానికి రెడీ అయ్యాడు హార్దిక్. సెలబ్రెటీల వివాహ వేడుకలకు కేంద్రంగా నిలిచే రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో వీరి పెళ్లి జరగనుంది.
రెగ్యులర్ మ్యారేజెస్ తరహాలోనే నాలుగు రోజుల పాటు వివాహ వేడుకలు జరగనున్నాయి. మెహందీ, సంగీత్.. ఇలా అన్ని రకాల తంతులూ ఈ పెళ్లిలో ఉండబోతున్నాయి. సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి.
ఇటీవలే న్యూజిలాండ్‌లో టీ20 సిరీస్‌లో కెప్టెన్‌గా హార్దిక్ జట్టుకు విజయాన్ని అందించాడు. ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడుతోంది. ఆ జట్టులో హార్దిక్ లేడు. తనకు దొరికిన ఖాళీ సమయంలో అతను పెళ్లి వేడుకలు పెట్టుకున్నాడు. హార్దిక్, నటాషా జంటకు పుట్టిన బిడ్డకు అగస్త్య అనే పేరు పెట్టుకున్న సంగతి తెలిసిందే.
This post was last modified on February 13, 2023 8:05 pm
సెన్సార్ బోర్డు ఏదైనా సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చిందంటే అది కేవలం పెద్దలకు ఉద్దేశించినది మాత్రమేనని అందరికీ తెలిసిన విషయమే.…
నిన్న జరిగిన తండేల్ సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగార్జున అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ విజయాలకు…
ఎంత టాలెంట్ ఉన్నా ఇండస్ట్రీలో ఒక్కోసారి అవకాశాలు అంత వేగంగా రావు. హిట్టు పడినా సరే కొన్నిసార్లు దురదృష్టం పలకరించి…
సోంపు గింజలు ఒకప్పుడు ప్రతి ఇంట్లో భోజనం తర్వాత తప్పనిసరిగా తినేవారు. అయితే, ఇప్పుడా అలవాటు చాలా మందిలో తగ్గిపోయింది.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.…
తెలంగాణాలో ఉప ఎన్నికలకు దాదాపుగా రంగం సిద్ధం అయినట్టుగానే కనిపిస్తోంది. ఎక్కడైనా.. ఉప ఎన్నికలంటే… అధికార పార్టీలు రంకెలు వేయడం…