కేక్.. అంటే సాధారణంగా ఏ అట్టల మీదో, కప్పుల్లోనో తయారు చేసే పదార్థం. అయితే.. కొన్ని కొన్ని చోట్ల ఇటీవల కాలంలో కళా ఖండాలుగా కూడా కేకులను రూపొందిస్తున్నారు. బొమ్మలుగా కూడా చిత్రీకరిస్తున్నా రు. అయితే.. ఇప్పుడు దీనికి మించి ప్రయోగం చేయాలని అనుకున్నారో ఏమో.. ఒక బేకర్.. ఏకంగా కేక్‌తో డ్రెస్‌ను రూపొందించారు. ప్రస్తుతం ఇది గిన్నీస్ రికార్డు సొంతం చేసుకునే దిశగా దూసుకుపోతోంది.
ఇంతకీ విషయం ఏంటంటే.. స్విట్జర్లాండ్‌కు చెందిన ఒక బేకర్ ప్రపంచంలోనే అతిపెద్ద కేక్ దుస్తులను తయారు చేశాడు. ఇవి చక్కగా ధరించే అవకాశం ఉండడం గమనార్హం. అంతేకాదు.. ఈ కేక్‌డ్రెస్ తో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. స్వీటీ కేక్స్‌కి చెందిన నటాషా కోలిన్ కిమ్ ఫాహ్ లీ ఫోకాస్ జనవరి 15న స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో ఎగ్జిబిటర్ల ముందు కేక్ పదార్థాలతో చేసిన తన దుస్తులను ప్రదర్శించారు.
ధరించగలిగిన కేక్ దుస్తులు అసాధారణమైన 131.15 కిలోల బరువుతో ఉన్నాయి. స్వీటీకేక్స్ అనేది 2014లో నటాషాచే స్థాపించబడిన, స్విట్జర్లాండ్‌లోని థున్‌లో ఉన్న కస్టమ్ కేక్‌లలో ప్రత్యేకత కలిగిన బేకరీ. ఇది పలు సందర్భాల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లను సొంతం చేసుకుంది.
“నటాషా కోలిన్ కిమ్ ఫాహ్ లీ ఫోకాస్, స్వీటీకేక్స్ ద్వారా ధరించగలిగే అతిపెద్ద కేక్ 131.15 kg (289 lb 13 oz ).” క్యాప్షన్‌తో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక హ్యాండిల్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో భారీ ఎత్తున వైరల్ అవుతుండడం విశేషం.
This post was last modified on February 3, 2023 12:18 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…