ఆయనకు 81 సంవత్సరాల వయసు. కానీ, ఓ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. అది కూడా సదరు వ్యక్తి 70 ఏళ్ల వయసు లో చేసిన తప్పునకు ఈ శిక్ష విధించడం గమనార్హం. ఆయనే గుజరాత్‌కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దేశ, విదేశాలలోనూ మంచి పేరు తెచ్చుకున్న ఆశారాం బాపూ. అందరూ గురూజీ, స్వామీజీగా పిలుచుకునే బాపూ.. పదేళ్ల కిందట తన ఆశ్రమంలో పనిచేస్తున్న ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కోర్టుకు చార్జిషీటు సమర్పించారు.
ఈ క్రమంలో అరెస్టయిన బాపూ.. అప్పటి నుంచి విచారణ ఖైదీగా ఉన్నారు. గాంధీనగర్‌లోని సెషన్స్ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. బాపూ చేసిన నేరానికి జీవిత ఖైదు విధించింది. ఆయన ఆశ్రమంలో శిష్యురాలిగా ఉన్న తనను అక్రమంగా నిర్బంధించి 2001 నుంచి 2006 మధ్య పలుమార్లు అత్యాచారం చేసినట్టు సూరత్‌కు చెందిన మహిళ ఆరోపించింది. దీనిపై అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. అత్యంత వివాదంగా కూడా మారింది. మొదట్లో కేసు కూడా నమోదు చేసేందుకు పోలీసులు ముందుకురాలేదు.
ఎట్టకేలకు కోర్టు జోక్యంతో 2013లో బాపూతో పాటు మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన కోర్టు తగిన ఆధారాలు లేకపోవడంతో ఆశారాం బాపూ భార్య సహా మిగిలిన వారిని నిర్దోషులుగా ప్రకటించింది. కేసులో దోషిగా తేలిన ఆశారాం బాపూ ప్రస్తుతం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జైలులో ఉన్నారు. ఆశారాం బాపూ గతంలో అధ్యాత్మిక గురువుగా ఎందరో శిష్యులను సంపాదించుకున్నారు. దేశ విదేశాల్లో 400 కేంద్రాలను స్థాపించారు.
40కి పైగా కార్పొరేట్ స్కూళ్లను నిర్వహిస్తున్నారు. అనేక మంది రాజకీయ నేతలకు గురువుగా ఆయన పేరు ఒక దశలో మార్మోగింది. తాజా తీర్పులో సెక్షన్ 376, 377 ప్రకారం ఆయనకు జీవిత ఖైదు విధిస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. అదేవిధంగా రూ.50 వేల జరిమానా కూడా విధించింది. అయితే.. 81 ఏళ్ల వయసులో జీవిత ఖైదు విధించడం.. దేశంలో స్వామీజీలపై వస్తున్న ఆరోపణలు వంటివి చర్చకు దారితీస్తున్నాయి.
This post was last modified on January 31, 2023 10:01 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…