భారత యువ క్రికెటర్లు ఈ మధ్య రెచ్చిపోయి బ్యాటింగ్ చేసేస్తున్నారు. నెల కిందటే ఇషాన్ కిషన్ అనే యువ బ్యాట్స్‌మన్ బంగ్లాదేశ్ మీద మెరుపు డబుల్ సెంచరీ బాదాడు. వన్డే మ్యాచ్‌లో 35వ ఓవర్లోనే డబుల్ సెంచరీ మార్కును అందుకున్న అతను.. చివరి వరకు క్రీజులో నిలిస్తే ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కేవాడే. కానీ మధ్యలో ఔటైపోయాడు.
ఇప్పుడు ఇషాన్ స్థానంలో ఓపెనర్‌గా ఆడుతున్న మరో యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ కూడా వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. అతను న్యూజిలాండ్‌తో హైదరాబాద్‌లో జరిగిన తొలి వన్డేలో డబుల్ సెంచరీ బాదేశాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి చివరి ఓవర్ వరకు క్రీజులో ఉన్న శుభ్‌మన్.. 49వ ఓవర్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. దీంతో అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. నిన్న సాయంత్రం నుంచి క్రికెట్ వర్గాల్లో శుభ్‌మన్ గురించే చర్చ.
ఐతే ఈ సందర్భంగా అందరూ సచిన్ టెండుల్కర్‌తో ముడిపెట్టి శుభ్‌మన్ మీద కామెంట్లు చేస్తున్నారు. ప్రపంచ క్రికెట్లో డబుల్ సెంచరీ ఘనత సాధించిన మామాఅల్లుళ్లు సచిన్-గిల్ మాత్రమే అంటూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడు సచినే అన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ మైలురాయిని అందుకున్న ఎనిమిదో ఆటగాడు గిల్. ఐతే సచిన్ కూతురు సారాతో శుభ్‌మన్ ప్రేమలో ఉన్నట్లు రెండు మూడేళ్ల కిందట జోరుగా ప్రచారం జరిగింది.
అండర్-19 వరల్డ్ కప్‌లో మెరుపులతో వెలుగులోకి వచ్చిన గిల్.. కొంత కాలానికి సారాతో ప్రేమలో పడ్డాడని.. డేటింగ్ చేస్తున్నాడని.. అతను సచిన్ అల్లుడు కావడం లాంఛనమే అని ఒక టైంలో జోరుగా ప్రచారం జరిగింది. కానీ గిల్, సారా కలిసి కనిపించిన ఫొటోలైతే సోషల్ మీడియాలోకి రాలేదు. చిత్రంగా బాలీవుడ్ హీరోయిన్ అయిన మరో సారాతో అతను గత ఏడాది చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. వాళ్లిద్దరూ విమానంలో కలిసి ప్రయాణిస్తున్న ఫొటోలు.. అలాగే దుబాయ్ లోని ఒక రెస్టారెంట్లో భోంచేస్తున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇద్దరి మధ్య ఏమీ లేకుండా ఇలా కలిసి తిరిగే ఛాన్సే లేదు. సచిన్ కూతురు సారాకు, గిల్‌కు మధ్య ఏమీ లేకుండానే వార్తలు పుట్టించేసి.. ఈ మధ్య సారా అలీ ఖాన్‌తో గిల్ తిరుగుతున్న ఫొటోలను విస్మరించి ఇంకా సచిన్, గిల్ మామా అల్లుళ్లు అంటూ కామెంట్లు చేయడం విడ్డూరం.
This post was last modified on January 19, 2023 8:13 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…