Luna.. ఈ పేరు బహుశ ఇప్పటి తరం ప్రజలకు పెద్దగా తెలియకపోవచ్చు. ఓ 30 ఏళ్లకు కిందటి ప్రపంచా నికి వెళ్తే.. లూనా మోపెడ్‌కు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. మధ్య తరగతి కుటుంబాల దివ్య వాహనం, కల్పతరువు ఇదే! అప్పట్లో కేవలం 8 నుంచి 10 వేలకే ఈ వాహనం లభ్యమయ్యేది. అంతేకాదు.. దీనిని నడపడం ఈజీ.. లైసెన్స్ కూడా అవసరం లేదు.
ఎందుకంటే.. ఇది 50 సీసీ ఇంజన్ కావడంతో రవాణా చట్టం ప్రకారం.. దీనిని నడిపేవారు 18 ఏళ్లు పైబడి ఉంటే చాలు లైసెన్స్‌తోనూ పని ఉండేది కాదు. దీంతో ఈ వాహనం.. అప్పట్లో హాట్ కేకులా అమ్ముడు పోయింది. ఎవరి ఇంటి ముందు చూసినా.. లూనా కనిపించేంది. అంతేకాదు.. అప్పట్లో లూనా రిపేర్ స్పెషలిస్టు అనే బోర్డులు కూడా కనిపించాయి.
అయితే, కాలక్రమంలో మార్పులు చోటు చేసుకోవడం, హీరో హోండా వంటి సంస్థలు రావడంతో లూనా మూలనపడింది. దాదాపు ఇప్పుడు అందరూ మరిచిపోయారు. అయితే.. ఇప్పుడు ఈ లూనా.. దాదాపు 30 ఏళ్ల తర్వాత(50 అంటున్నారు) తిరిగి తన ప్రస్థానాన్ని కొనసాగించేందుకు రోడ్లపై పరుగులు పెట్టేందుకురెడీ కానుంది. అయితే, ఈ సారి పెట్రోల్‌తో కాదు.. బ్యాటరీతో!
పర్యావరణ పరిరక్షణ, 2030 నాటికి ప్రపంచ పర్యావరణ సదస్సు తీర్మానాన్ని చేరుకోవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో బ్యాటరీ వాహనాలకు ప్రోత్సాహం పెరిగింది. ఈ క్రమంలో ఇప్పటికే అనేక బ్యాటరీ వాహనాలు వచ్చినా.. తిరిగి లూనా.. తనదైన శైలిలో భారత ప్రజలను ఆకట్టుకునేందుకు సరికొత్త రూపంతో త్వరలోనే అవతార్ -ఈవీగా రానుంది. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారడం గమనార్హం.
This post was last modified on December 28, 2022 10:26 pm
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…