సాధారణంగా పెళ్లిళ్లకు ఆహ్వానాలు అందుతుంటాయి. అయితే.. ఇప్పుడు మీరు చదవబోయేది వెరైటీ ఇన్విటేషన్. దీనిని ఏర్చి కూర్చిన విధానం అద్భుతః! ఎందుకంటే.. ప్రపంచంలో కరోనా వ్యాప్తి అయిపోయిందని.. చేతులు దులిపేసుకుని.. కంటి నిండా నిద్రపోవాలని అనుకున్న తరుణంలో మరోసారి కరోనా కేసులు పుంజుకున్నాయి.
కనీసం ఈ ఏడాదైనా.. నూతన సంవత్సర వేడుకలు చేసుకుందామని అనుకున్న ప్రజలకు చైనా సహా పలు దేశాల్లో పెరుగుతున్న కరోనా కేసులుకంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా ప్రధాని మోడీ తన మన్‌కీబాత్‌లో కరోనా జాగ్రత్తలను మరోసారి పూసగుచ్చినట్టు వివరించారు.
ఇదిలావుంటే.. కరోనా నేపథ్యంలో తాజాగా ఒక వెరైటీ పెళ్లి ఆహ్వాన పత్రిక వైరల్‌గా మారింది. అదేంటంటే..
కరోనా వారి పెండ్లి పిలుపు
మా దేశ అదృశ్య పుత్రుడు వరుడు: చి కరోనా,
చైనా వాస్తవ్యులు MBBS, FRCS
వధువు: చిలసౌ। మిగిలిన దేశాల ప్రజలు
వివాహ మహోత్సవము జరుపుటకు కాలము నిర్ణయించబడినది
సుముహూర్తం: స్వస్తిశ్రీ చైనా మానేన శ్రీ కరోనా నామ సం॥ర కరోనా నక్షత్రయుక్త కరోనాలగ్న పుష్కరాంశ గడియ (కరోనా స్పెడ్ అవుతున్నంతకాలం)
కళ్యాణవేదిక: క్వారంటైన్ కేంద్రాలు, ఐసోలేషన్ వార్డు గల హస్పిటల్ నందు
విందు: 2 గోళీలు (టాబ్లెట్స్) 3 టానిక్ సిసాలు (డాక్టర్స్ వేసుకోమన్నటైం కి
ఆహ్వానించువారు: చైనా దేశా ప్రజలు
-బంధువులు:-
పెద్దనాన్న: ఇటలీ,
చిన్న నాన్న: ఫ్రాన్స్
అత్తమ్మ: నెదర్లాండ్,
పెద్దమ్మ: స్పెయిన్,
చిన్నమ్మ: ఇరాన్
మామయ్య: ఇంగ్లాండ్
209 దేశాల బంధుమిత్రులు అభినందనలతో…
ముఖ్య అతిథి: అమెరికా
విన్నపము: మూతికి గుడ్డకట్టి, సానిటైజర్ చేతబట్టి, కళ్యాణవేదిక నందు సామాజిక దూరం పాటిస్తూ తమ చేతలతో కరోనా ని ఆశీర్వదించగలరు.
This post was last modified on December 25, 2022 9:17 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…