ఒక కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) ఉన్నాడని అనుకోండి. ఆయన ఏం చేస్తారు. తను అక్కడి కంపెనీకి బాస్‌నని, మిగిలినవారంతా ఉద్యోగులేనని.. భావిస్తాడు. అలానే భావించాలి. కేవలం వారితో పను లు చేయించుకునేందుకు.. మాత్రమే పరిమితం అవుతారు. దీంతో ఉద్యోగులకు సీఈవోకు మధ్య మానవీయ సంబంధాలు బాగుంటాయా? అంటే.. చెప్పడం దాదాపు కష్టమే.
ఇప్పుడు.. టీడీపీ పరిస్థితి కూడా అలానే ఉందని అంటున్నారు పరిశీలకులు. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలోనూ ఆయన సీఈవో గానే వ్యవహరించారనే వాదన వినిపించింది. ఇది.. ఆయనకు ఫలితం ఇవ్వకపోగా.. అధికారం నుంచి పడేసింది. దీనికి కారణం.. ప్రజలతో మానవీయ సంబంధాలను ఆయన మెరుగు పరుచుకోకపోవడమే. దీంతో ఓటు బ్యాంకు భారీగా తగ్గిపోయింది.
పోనీ.. ఇప్పుడు అయినా.. ఆయన మారారా? అంటే కనిపించడం లేదు. తను కంపెనీ సీఈవోను అని చెప్పు కోకపోయినా.. ఆయన మాటల్లో వినిపిస్తున్న గీర్వాణం.. దూకుడు.. వంటివి..మాస్‌కు ఆయనను చేరువ చేయలేక పోతున్నాయి. అదే వైసీపీని తీసుకుంటే.. సీఎం జగన్ ప్రజలతో కనెక్ట్ అవుతున్నారు. నేను మీ బిడ్డను అని చెబుతున్నారు. అంతేకాదు.. ప్రతి వాక్యంలోనూ .. మీ బిడ్డ.. అనే మాటను ఆయన చొప్పిస్తున్నారు.
అవసరం ఉన్నా.. లేకున్నా.. మీ బిడ్డ అనే కామెంట్ బాగానే దొర్లుతోంది. అదేసమయంలో అక్కలు చెల్లెమ్మలు, అవ్వ, తాత.. అంటూ.. సంబంధాలను కూడా కలుపుతున్న విషయం తెలిసిందే. ఇవి ప్రజలకు జగన్‌ను కనెక్ట్ చేస్తున్నాయి. దీంతో మాస్‌లో జగన్ గురించి ఇలాంటి చర్చే జరుగుతోంది. కానీ, చంద్రబాబు ఇలా కనెక్ట్ కాలేక పోతున్నారు. ప్రజలతో అనుబంధాన్ని పెంచుకునే బదులు.. ఆయన కంపెనీ సీఈవోగానే ఉండిపోయేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates