Trends

ఈ ఆరేళ్ల కుర్రాడిని ప్రపంచమంతా ఎందుకు పొగుడుతోంది?

బ్రిడ్జర్ వాకర్.. బ్రిడ్జర్ వాకర్.. ప్రపంచవ్యాప్తంగా ఓ వారం రోజుల నుంచి మర్మోగుతున్న పేరిది. ఇది ఓ ఆరేళ్ల పిల్లాడి పేరు. ముఖం మీద తీవ్ర గాయాలతో.. పక్కన తన చిన్నారి చెల్లితో కలిసి నిలబడి ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శభాష్ చిన్నోడా.. అంటూ కోట్లాది మంది అతణ్ని పొగుడుతున్నారు? అతను ఏం చేశాడో తెలిస్తే ఈ వార్త చదివాక చివర్లో మీరు కూడా ఆ కుర్రాడిని శభాష్ అనకుండా ఉండలేరు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..

అమెరికాలోని వ్యోమింగ్‌కు చెందిన బ్రిడ్జర్ వాకర్‌కు నాలుగేళ్ల చిన్నారి చెల్లెలు ఉంది. ఇటీవల ఆ చిన్నారిపై ఓ పెద్ద కుక్క దాడి చేయబోయింది. అది చూసిన వాకర్.. చెల్లెని తప్పించి కుక్కకు ఎదురు నిలిచాడు. అది పాశవిక రీతిలో అతడిపై దాడి చేసింది. ఐతే ముఖం సహా ఒళ్లంతా గాయాలైనా.. పలు చోట్ల చీరుకుపోయినా.. రక్తం ధారలుగా కారుతున్నా అతను తన పోరాటాన్ని ఆపలేదు. ఆ కుక్క తన చెల్లెలి దరిదాపుల్లోకి వెళ్లకుండా చూసుకున్నాడు. చివరికి ఎవరో పక్కింటి వాళ్లు చూసి కుక్కును తరిమికొట్టారు.

అనంతరం వాకర్‌ను ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాల పాలైన వాకర్‌కు వైద్యుల బృందం రెండు గంటలకు పైగా సర్జరీ చేయాల్సిన అవసరం పడింది. అతడి ఒంటిపై 90 దాకా కుట్లు పడ్డాయట. ముఖం మీద గాయాన్ని చూస్తే తీవ్రత అర్థమైపోతుంది. ఎందుకింత సాహసం చేశావని అడిగితే.. చెల్లెలంటే ప్రాణమని.. ఆ కుక్కో, తానో ఎవరో ఒకరే మిగలాలి తప్ప చెల్లెలిపై అది దాడి చేయకూడదని అనుకున్నానని ఆ కుర్రాడు చెప్పడం విశేషం. అతడి ధైర్యసాహసాలకు ఫిదా అయిన నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వరల్డ్ బాక్సింగ్ సమాఖ్య అతడికి ప్రత్యేక గౌరవాన్ని ఇవ్వడానికి సిద్ధమవడం విశేషం.

This post was last modified on July 18, 2020 4:19 pm

Share
Show comments
Published by
Satya
Tags: Bridger

Recent Posts

చంద్రబాబు, జగన్… విదేశాలకు ఇద్దరూ ఒకేసారి

ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……

5 hours ago

భన్సాలీతో బన్నీ – ఏం జరుగుతోంది ?

సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…

10 hours ago

ప‌వ‌న్‌కు చిర్రెత్తుకొచ్చిన వేళ‌.. !

డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్ప‌లు మామూలుగా ఉండ‌డం లేదు. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా..…

11 hours ago

తిరుప‌తి తొక్కిస‌లాట‌: జ‌గ‌న్ కామెంట్స్ ఇవే!

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం త‌న‌కు భ‌య‌ప‌డుతోంద‌ని వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్ షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌కు భ‌య‌ప‌డుతున్న…

12 hours ago

ఒకే చోట ప‌వ‌న్‌-జ‌గ‌న్ ఎదురు పడ్డ వేళ‌!

ఏపీ రాజ‌కీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్య‌వ‌హ‌రించే జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌లు…

12 hours ago

క్షమించండి… పబ్లిక్ గా సారీ చెప్పిన పవన్

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…

13 hours ago