అంతర్జాతీయ నేరగాడు, సీరియల్ కిల్లర్.. చార్లెస్ శోభరాజ్ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. ఇది అంతర్జాతీయంగా చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. ఈయన ఎవరు? ఎందుకు ప్రాధాన్యం? అనే చర్చ వస్తుంది. ఈయనకు భారత్‌కు కూడా సంబంధం ఉంది. పైగా.. ఈయన భారత పౌరుడు కూడా. అంతేకాదు.. ఇందిరమ్మ హయాంలో దేశంలో చార్లెస్ శోభరాజ్ పేరు మార్మోగింది. అంతేకాదు.. చాన్నాళ్లు ఇండియాలో దాక్కున్న ఈయనను అప్పగించకపోవడంపై నేపాల్.. భారత్‌ను అభిశంసించి.. అంతర్జాతీయ వివాదంగా మార్చింది.
విషయంలోకి వెళ్తే.. కరడుగట్టిన హంతకుడు, ఫ్రాన్స్‌లో స్థిరపడిన సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్(78).. జైలు నుంచి విడుదల కానున్నాడు. ఆరోగ్య కారణాల రీత్యా అతడిని విడుదల చేయాలని నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశించింది. చార్లెస్‌కు వ్యతిరేకంగా పెండింగ్ కేసులేమీ లేకపోతే విడుదల చేసిన 15రోజుల్లోపు అతడిని స్వదేశానికి(ఫ్రాన్స్) పంపేయాలని సూచించింది.
21 ఏళ్లుగా జైల్లోనే!
నార్త్ అమెరికాకు చెందిన ఇద్దరు పర్యాటకులను చంపిన కేసులో శోభరాజ్‌ను 2003లో నేపాల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నేపాల్ సుప్రీంకోర్టు అతడికి 21ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. దీంతో అప్పటినుంచి అతడు నేపాల్ జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, సుమారు 20ఏళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తుండటం, వృద్ధాప్యం దరిచేరడం వంటి కారణాలతో అతడి విడుదలకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తెలిపారు.
భారత్‌తో రిలేషన్ ఇదే..
చార్లెస్ శోభరాజ్ భారత పౌరుడికి, వియత్నాం పౌరురాలికి జన్మించాడు. అతడి చిన్న వయసులోనే వారు విడిపోయారు. దీంతో తన తల్లి రెండో భర్త శోభరాజ్‌ను దత్తత తీసుకున్నారు. కానీ, ఆ తర్వాత వారికి పిల్లలు పుట్టడంతో శోభరాజ్‌ను నిర్లక్ష్యం చేయడంతో అతడు నేరాల బాటపట్టాడు. 1970లలో ఆగ్నేయాసియా దేశాల్లో వరుస హత్యలు, దోపిడీలకు పాల్పడటం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అతడి పేరు మార్మోగింది. ఆపై 20 హత్య కేసుల్లో చిక్కుకున్న శోభరాజ్.. ఢిల్లీలోని ఓ ఫ్రెంచ్ పౌరుడికి విషం ఇచ్చి చంపిన కేసులో 1976లో అరెస్టయి భారత్‌లోని వివిధ జైళ్లలో 21 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. అయితే.. నేపాల్ మాత్రం భారత్ అతనిని కాపాడుతోందంటూ.. అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లి.. రచ్చ చేసింది. దీంతో ఇందిరమ్మ ప్రభుత్వం.. తర్వాత కాలంలో నేపాల్‌తో చర్చించి.. అప్పగించారు.
This post was last modified on December 22, 2022 8:59 pm
‘బాహుబలి: ది బిగినింగ్’కు పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసినపుడు బాలీవుడ్ నుంచి మంచి సపోర్టే లభించింది. కరణ్ జోహార్…
తిరుమల తోపులాట ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటనపై ఏపీలోని కూటమి ప్రభుత్వం వేగంగా స్పందించింది. బుధవారం విశాఖ పర్యటనకు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు… దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల…
అభిమానులు ఆతృతగా ఎదురు చూసిన అన్ స్టాపబుల్ 4 నుంచి బాలకృష్ణ - రామ్ చరణ్ ఎపిసోడ్ నిన్న సాయంత్రం…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ఉదయం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా…
నిజమే. ఓ వైపు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత బుధవారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. అనూహ్యంగా…