దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన శ్రద్దా వాకర్ దారుణ హత్య ఉదంతంలో నిందితుడిగా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా. సహజీవనం చేస్తూ.. పెళ్లి కోసం ఒత్తిడి చేసిందన్న కారణంగా దారుణమైన రీతిలో ముక్కలు ముక్కలుగా నరికి.. ఇంట్లోని పెద్ద ఫ్రిజ్ లో అట్టి పెట్టి.. ఒక్కో ముక్కను విడిగా బయట పారేసి వచ్చిన భయంకర ఉదంతం వెలుగు చూడటం తెలిసిందే. కోర్టు విధించిన రిమాండ్ లో భాగంగా అతడ్ని తీహార్ జైలుకు తరలించారు.
జైల్లో ఉన్న అతను ఎవరితోనూ మాట్లాడటం లేదని.. ముభావంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. తన కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు సైతం ఆసక్తి చూపటం లేదని జైలు అధికారులు వెల్లడించారు. జైల్లోని తన సెల్ లో పుస్తకాలు చదువుతూ కాలం గడుపుతున్నట్లుగాచెబుతున్నారు. ఇప్పటికి తన కుటుంబ సభ్యులు.. స్నేహితుల జాబితాను ఆఫ్తాబ్ ఇవ్వలేదని చెబుతున్నారు.
తీహార్ జైల్లో ఉన్న ఖైదీలకు తమ కుటుంబ సభ్యులు.. మిత్రుల్ని కలుసుకునేందుకు వారంలో రెండు రోజులు అవకాశం ఇస్తారు. అంతేకాదు.. వారంలో రెండు రోజుల పాటు ఐదు నిమిషాల చొప్పున ఫోన్ చేసుకునేందుకు అవకాశం ఇస్తారు. అయితే.. ఇందుకోసం రాతపూర్వకంగా సదరు వ్యక్తుల ఫోన్ నెంబర్లను ఇవ్వాల్సి ఉంటుంది. అఫిడవిట్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఆఫ్తాబ్ అలాంటిదేమీ చేయలేదని చెబుతున్నారు.
ఎవరితో కలవకుండా తన మానాన తాను ఉంటున్న అతడికి జైలు అధికారులు ఇంగ్లిషు నవల్స్ ఇచ్చారు. అమెరికన్ రచయిత పాల్ థెరౌక్స్ ట్రావెల్ లాగ్ అయిన ది గ్రేట్ రైల్వే బజార్ పుస్తకాన్ని ఇవ్వగా.. మరికొన్ని పుస్తకాలు కూడా తనకు ఇవ్వాలని కోరినట్లుగా చెబుతున్నారు.
ఐకాన్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన ఘట్టం జరిగిపోయింది. నిన్నటిదాకా పక్క రాష్ట్రాల్లో జరిగిన పుష్ప 2 ప్రమోషన్లను…
పుష్ప 2 ది రూల్ కు సంబంధించి ఎన్ని ఈవెంట్లు చేసినా పని ఒత్తిడి వల్ల ఇప్పటిదాకా బయటికి కనిపించనిది…
హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన పుష్ప 2 ది రూల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాస్…
కన్నడ మూవీ కిస్ తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. దర్శకేంద్రుడు తెరకెక్కించిన పెళ్లి సందడి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో…
తెలంగాణలో టికెట్ ధరల పెంపు, జీవోలు వచ్చేసి ఆన్ లైన్ అమ్మకాలు మొదలయ్యాక కూడా ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఆలస్యం…
కిక్కిరిసిపోయిన అభిమాన జనసందోహం మధ్య పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో ఘనంగా…