ఈమధ్య పిల్లలు యువకులు ఆన్లైన్ గేమ్స్ ఎక్కువ ఆడుతున్నారు. చేతిలో ఫోన్ లేదా టాబ్లెట్ ఉంటే చాలు డబ్బులు పెట్టు మరి గేమ్స్ లోని కొత్త ఫీచర్స్ ను అన్ లాక్ చేస్తున్నారు. ఇంకేముంది నిమిషాల్లో వేలు, లక్షల రూపాయలు గోవిందా.
రంగారెడ్డి జిల్లాలోని షాదాబ్ మండలం సీతారాంపూర్ చెందిన ఒక రైతు నిర్వాసితుడు కావడంతో అతనికి 95 లక్షల రూపాయలు పరిహారం వచ్చింది. ఇక ఆ డబ్బుని అతడు బ్యాంకులో భద్రపరుచుకున్నాడు. ఆన్లైన్ లో ‘కింగ్ 527’ అనే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆడుకున్నాడు. ఆ గేమ్ ఆడాలంటే అతను బ్యాంక్ అకౌంట్ ను లింక్ చేయవలసి ఉంది.
అలా లింక్ చేసి క్రమేపి డబ్బులు అతను డబ్బులు పెట్టి గేమ్ ఆడుతూ ఉన్నాడు. ఇంకేముంది ఒక్కసారిగా 95 లక్షల రూపాయలు ఆ గేమ్ ఆడేందుకు పెట్టి స్వాహా అనిపించాడు. ఈ విషయం తెలుసుకొని తల్లిదండ్రులు లబోదిబోమన్నారు.
ఇటీవల భూసేకరణలో ప్రభుత్వం వారికి అంత పెద్ద మొత్తాన్ని ఇచ్చింది. అవి బ్యాంకులో జాగ్రత్తగా ఉంటాయని డిపాజిట్ చేస్తే వాళ్ళ కొడుకు ఇలా ఆన్లైన్ గేమ్ లో కాజేశాడు. అటు భూమి పోయి… ఇటు డబ్బులు పోయి… ఆ కుటుంబం తీవ్రవేదనకు గురి అవుతుంది.
ఈమధ్య సైబన్ నేరాలు జోరుగా సాగుతున్న సమయంలో ఇలాంటి గేమ్స్ ఆడటం ఎంతైనా ప్రమాదం. వీటిలో గెలుపు ఒక్కసారి మనకు చూపించి తర్వాత మన మెదడుని వారి గేమ్ ద్వారా కంట్రోల్ లోకి తెచ్చుకొని మనకి దానిని మనకు ఒక వ్యసనంగా మార్చేస్తారు ఇలా లక్షల డబ్బును కాజేస్తారు.