లెజెండరీ అంతర్జాతీయ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ గొప్పతనం గురించి అందరికీ తెలిసిందే. విలక్షణమైన బౌలింగ్ యాక్షన్ తో అంతర్జాతీయ క్రికెట్ లో 546 వికెట్లు తీసిన ఈ శ్రీలంక ఫాస్ట్ బౌలర్ ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ గా ఉన్నాడు.
తాజాగా మలింగ ఒక వీడియోలో ఒక బ్యాటర్ కి ట్రైనింగ్ కోసం బంతులు విసురుతూ కనిపించాడు. ఆ వీడియోలో ఉన్న బ్యాటర్ ఎవరో కాదు తన సొంత కుమార్తె. చిట్టి బ్యాట్ పట్టుకొని ప్రపంచలోనే గొప్ప బౌలర్లలో ఒకరైన తన తండ్రి నుండి క్రికెట్ పాఠాలు నేర్చుకుంటున్న ఆమె వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయింది.
టెన్నిస్ బంతులను తన కూతురుకు విసురుతూ శిక్షణ ఇస్తున్న మలింగ ఆమె భవిష్యత్తులో శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టుకు ఆడాలని కోరుకుంటున్నాడు. సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్, సునీల్ గవాస్కర్ కొడుకు రోహన్, రోజర్ బిన్నీ కొడుకు స్టువర్ట్ బిన్నీలు కూడా ఈ కోవకే చెందుతారు. కానీ మలింగ మాత్రం తన కొడుకుకి కాకుండా కూతురుకి ఇలా క్రికెట్ శిక్షణ ఇవ్వడం నిజంగా ఆశ్చర్యకరం, అభినందనీయం.
This post was last modified on December 17, 2022 10:55 pm
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…
ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా…