మద్యం మత్తు తలకెక్కితే మనిషి ఎలా అదుపు తప్పుతాడో చెప్పడానికి ఇది తాజా ఉదాహరణ. ఒక అమ్మాయి పూటుగా మందుకొట్టి తానేం మాట్లాడుతున్నానో, ఎలా ప్రవర్తిస్తున్నానో తెలియకుండా చేసిన వీరంగం తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో మన ఆంధ్రప్రదేశ్‌కు చెందింది కావడం విశేషం.
విశాఖపట్నంలో ఓ అమ్మాయి మందు కొట్టడమే కాక గంజాయి నిండిన సిగరెట్ కాల్చి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోందని, న్యూసెన్స్ చేస్తోందని తెలుసుకుని సత్యనారాయణ అనే ఏఎస్‌ఐ తన టీంతో కలిసి వెళ్లారు. గొడవ చేస్తుండడం గురించి ప్రశ్నిస్తుండగా.. ఆ అమ్మాయి రెచ్చిపోయింది.
ఏఎస్సైని పట్టుకుని ‘‘ఎర్రి… లం……కా..’’.. ‘‘నీ అమ్మని..’’ లాంటి దారుణమైన బూతులు మాట్లాడుతూ ఆ అమ్మాయి వీరంగం సృష్టించింది. ఇలా బూతులు మాట్లాడుతుండగా. పక్కన ఆ అమ్మాయి తల్లి కూడా ఉంది. ఆమెకు పోలీసులు గురించి కంప్లైంట్ చేస్తూ బూతులతో రెచ్చిపోయిందా అమ్మాయి. తనను ఐదుసార్లు కొట్టారని, అయినా పట్టించుకోలేదని.. ఏం పీకుతావో చూస్తా అంటూ బూతులు అందుకుంది. లం…..కా అని తిడుతూ ఆమె ఏఎస్ఐని ఎగిరి తన్నడం గమనార్హం. దీంతో ఆయన లాఠీతో ఆమెను ఒక దెబ్బ కొట్టారు.
వీడియోను గమనిస్తే ఆ అమ్మాయికి తనేం చేస్తోందో తెలియని మైకంలో ఉందని అర్థమవుతోంది. కేవలం మందుకొడితే ఈ స్థాయిలో అదుపు తప్పే అవకాశం లేదు. ఇదంతా గంజాయి ప్రభావం అన్నది స్పష్టం.
ఆంధ్రాలో మునుపెన్నడూ లేని విధంగా గంజాయి సరఫరా పెరిగిందని, యువత దాని మత్తులో చిత్తయిపోతున్నారని ఇటీవల తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ వీడియో చూశాక పరిస్థితి ఎంత అదుపు తప్పుతోందో అర్థం అవుతోంది. అర్జెంటుగా దీనికి అడ్డుకట్ట వేయకపోతే తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందనడానికి ఈ వీడియో ఉదాహరణ.
This post was last modified on December 15, 2022 4:46 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…