ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్ల ఆగడాలు మరీ ఎక్కువ అయిపోతున్నాయి. తాజాగా దిల్లీ ఒక వ్యక్తి వద్ద 50 లక్షలు టోకరా వేశారు. కేవలం అతని ఫోన్ కి మిస్డ్ కాల్స్ రావడం వల్ల అతను ఈ డబ్బుని పోగొట్టుకున్నాడు. అతను ఆ ఫోన్ కాల్స్ ఎత్తితే అవతల వేరొకరు మాట్లాడకపోగా కొద్దిసేపటికి అతని అకౌంట్ లో నుండి 50 లక్షలు రూపాయలు ట్రాన్స్ఫర్ అయినట్టు మెసేజ్ వచ్చింది. దీంతో ఏం చేయాలో పాలుపోక వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
విషయం ఏమిటంటే రాత్రి 7:00 నుండి 8:30 గంటల ప్రాంతంలో అతనికి వేరు వేరు నెంబర్లనుండి ఫోన్లు వచ్చాయి. ఇతను ఎత్తి మాట్లాడితే అవతల వైపు నుండి సమాధానం ఉండదు. ఎటువంటి ఓటీపీ నెంబర్ ను ఇతని వద్ద తెలుసుకోకుండా సైబర్ నేరగాళ్లు ఇంత మొత్తాన్ని ఎలా కాజేయగలిగారు అన్న విషయం అంతుచిక్కడం లేదు.
ఇక పోలీసులు కేసుని రాసుకొని సిమ్ స్వాపింగ్ పద్ధతిలో ఈ మోసం జరిగి ఉంటుందని అనుకుంటున్నారు. సిమ్ స్వాపింగ్ అంటే. తన సిమ్ పోయిందని మరొక వ్యక్తి లాగా టెలిఫోన్ ప్రొవైడర్ తో మాట్లాడి అదే నెంబర్ పై ఇంకొక సిమ్ తీసుకొని వీరికి వచ్చే కాల్స్, మెసేజెస్ వారికి డైవర్ట్ చేసుకోవచ్చు. ఈ పద్ధతి ద్వారానే ఈ మోసం జరిగి ఉంటుందని సైబర్ పోలీసులు అనుమాన పడుతున్నారు. మరి నిజానిజాలు ఎలా ఉన్నా ఇలాంటి ఫోన్ కాల్స్ మాత్రం చాలా డేంజర్ అన్న విషయం అర్థం అవుతోంది.
This post was last modified on December 13, 2022 7:21 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…