భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకుపల్లిలో దారుణమైన ఉదంతం చోటు చేసుకుంది. వారికి ఇచ్చిన అప్పును తిరిగి అడుగుతున్నాడని కక్షతో ఇద్దరు దుండగులు ముత్యాలంపాడు కు చెందిన అశోక్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను నరికి చంపేశారు.
మృతుడు అశోక్ సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ అతనికి తెలిసిన ఇద్దరు వ్యక్తులకు లక్ష రూపాయలను వడ్డీకి అప్పుగా ఇచ్చాడు. ఇక వారు ఎన్ని రోజులకీ అప్పు తీర్చలేదు. అశోక్ పలుమార్లు అడిగినా వారి వద్ద సమాధానం లేదు.
ఇక సంఘటన జరిగిన రోజు అశోక్ ఆస్పత్రిలో ఉండగా… దుండగులు మూడు సార్లు అతనికి కాల్ చేశారు. చివరికి డబ్బులు ఇస్తాం అని ఘటనా స్థలానికి పిలిచి అతని పై దాడి చేసి చంపేశారు. కత్తితో గొంతు, చేతులు, కాళ్ళు మీద నరికి అశోక్ ను హతమార్చారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ హత్య అప్పు ఇచ్చిన లక్ష రూపాయల వల్లనే జరిగిందా లేదా దీనికి మరొక కోణం ఏదైనా ఉందా అన్న విషయం తెలియాల్సి ఉంది. అశోక్ కి ఒక సంవత్సరం ముందే పెళ్లి జరుగగా అతనికి ఒక నెల రోజుల వయస్సు ఉన్న బాబు కూడా ఉన్నాడు.
This post was last modified on December 12, 2022 6:39 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…