మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన లకు త్వరలోనే ఒక బిడ్డ పుట్టబోతున్నట్లు కొద్దిసేపటి క్రితమే మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా పోస్టు ద్వారా చెప్పడం జరిగింది.
“హనుమంతుని ఆశీస్సులతో రామ్ చరణ్ – ఉపాసనల మొదటి సంతానం త్వరలో కలగబోతుంది” అంటూ ఒక ఫోటో ద్వారా చిరంజీవి వెల్లడించారు. ఈ విషయాన్ని చిరంజీవి – సురేఖ దంపతులు, అలాగే ఉపాసన తల్లిదండ్రులు అయిన శోభన – అనిల్ కామినేని ఎంతో ఆందంగా పంచుకుంటున్నట్లు ఆ పోస్టు సారాంశం.
2012 జూన్ 14వ తేదీన రామ్ చరణ్, ఉపాసన లకు వివాహం జరిగింది. దాదాపు పదేళ్ల తరువాత ఒకరికి మొదటి సంతానం కలుగనుండడం గమనార్హం. ఉపాసన ఒక బిజినెస్ లేడీ. అలాగే చరణ్ కూడా తన కెరీర్ పై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టవలసి వచ్చి ఇన్ని రోజులు సంతానాన్ని నియంత్రించుకున్నట్లు అందరూ అనుకున్నారు.
ఉపాసన కూడా ఎన్నో సార్లు ఇంటర్వ్యూలలో ఇది తమ వ్యక్తిగత విషయం అని చెప్పింది. మొత్తానికి వీరిద్దరూ సరైన సమయం నిర్ణయించుకొని ఇన్ని ఏళ్లకి తమ సంతానాన్ని ప్లాన్ చేసుకున్నారు. ఏదైతే ఏం… మొత్తానికి రామ్ చరణ్ మొదటి సంతానం గూర్చిన వార్త విని మెగా అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates