Trends

నవీన్ రెడ్డి ఎపిసోడ్ లో అమ్మాయి తండ్రి కంప్లైంట్ లో ఏముంది?

సినిమాల్లో మాత్రమే కనిపించే సీన్లు వరుస పెట్టి చూసినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్ని చూసి షాక్ తిన్నారు తెలుగు ప్రజలు. తాను ప్రేమించిన అమ్మాయి మరొకరితో ఎంగేజ్ మెంట్ కు సిద్ధపడిందన్న ఆగ్రహంతో సదరు యువతిని ప్రియుడు నవీన్ రెడ్డి కిడ్నాప్ చేసిన వైనం పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ మహానగర శివారులో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది. యాభై మంది ముసుగులు.. హెల్మెట్లు పెట్టుకొని అమ్మాయి ఇంటికి వచ్చి.. అడ్డు వచ్చిన వారిని కొట్టేస్తూ.. అమ్మాయిని వెంట పెట్టుకెళ్లిన ఉదంతానికి సంబంధించిన పరిణామాలు వేగంగా సాగిపోతున్నాయి.

తన ఇంటిపై దాడి చేసి.. కనిపించిన వారిని కనిపించినట్లు కొట్టుకుంటూ వెళ్లి.. తన కుమార్తెను తీసుకెళ్లిన వైనంపై అమ్మాయి తండ్రి దామోదర్ రెడ్డి ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఇంతకీ ఆయన చేసిన ఫిర్యాదులో ఏముంది? అందులోని కీలక అంశాల్ని చూస్తే..

  • బొంగుళూరులోని ఒక బ్యాడ్మింటన్ కేంద్రంలో నా కుమార్తెకు నవీన్ రెడ్డితో పరిచయమైంది. ప్రేమ.. పెళ్లి పేరుతో రెండేళ్లుగా నా కుమార్తెను వేధించాడు. నిన్న నవీన్ రెడ్డి.. రూబెన్ తో పాటు మరో యాభై మంది అనుచరులు నా ఇంటిపైకి దాడి చేశారు.
  • ఐరన్ రాడ్లు.. రాళ్లును కారులో తీసుకొని మా ఇంటికి వచ్చారు. నా కుమార్తె.. మా కుటుంబ సభ్యుల్ని చంపాలని ఇంట్లోకి దూసుకొచ్చారు.
  • ఆ సమయంలో నవీన్ రెడ్డి కూడా వారితో ఉన్నాడు. నా తలపై రాడ్ తో నవీన్ వర్గీయులు దాడి చేశారు. ఆ సమయంలో నా స్నేహితులు మధ్యలోకి వస్తే వారిపైనా దాడి చేశారు.
  • నా కుమార్తెను బలవంతంగా కారులో ఎక్కించుకొని ఎత్తుకెళ్లారు. ఇంట్లో ఉన్న సామాన్లు.. సీసీ కెమేరాలను ధ్వంసం చేశారు. నా కుమార్తె విషయంలో మొదటి నుంచి నవీన్ రెడ్డి సైకోలా వ్యవహరించారు.
  • నవీన్ రెడ్డి తనను సొంతం చేసుకోవాలని ఎన్నో డ్రామాలు ఆడాడు. నా కుమార్తెను పెళ్లి జరిగినట్లు నమ్మించేందుకు ఎన్నో కుట్రలు చేశాడు. గత ఏడాది ఆగస్టు 27న నా కుమార్తెతో పెళ్లైనట్లుగా ప్రచారం చేసుకున్నాడు.
  • నా భార్యను పంపలేదంటూ ఎల్బీ నగర్ కోర్టులో పిటిషన్ వేశాడు. ఒక కారు కొని అందులో నామినీగా భార్య పేరు స్థానంలో నా కుమార్తె పేరు రాయించాడు. వాటిని ఆధారంగా చూపించి కోర్టులో పిటిషన్ వేశాడు.
  • ఆగస్టు 27న నా కుమార్తె ఆరోగ్యం బాగోలేదు. ఆసుపత్రిలో ఉంది. నా కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటి బిల్లుల్ని చూస్తే విషయం అర్థమవుతుంది.
  • పెళ్లి విషయంలో నవీన్ రెడ్డి అబద్ధం చెబుతుున్నాడు. నా కుమార్తెతో కలిసి దిగిన ఫోటోల్ని చూపించి పెళ్లి జరిగిందన్న ప్రచారానికి దిగాడు. ఇన్ స్టాలో పలువురికి ఆ ఫోటోల్ని పంపాడు.

This post was last modified on December 11, 2022 10:36 am

Share

Recent Posts

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

2 hours ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

2 hours ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

2 hours ago

అద్భుత ప్రయోగాల నిలయం ‘సింగీతం’

లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…

3 hours ago

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

5 hours ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

7 hours ago