రంగారెడ్డి జిల్లాలోని తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో రాగన్నగూడలో ఈరోజు ఉదయం చోటు చేసుకున్న ఒక డెంటిస్ట్ యువతి కిడ్నాప్ సంజనాత్మకంగా మారిన విషయం తెలిసిందే. సినీఫక్కీలో నవీన్ అనే యువకుడు ఏకంగా వందమంది యువకులంతో తను ప్రేమించిన యువతి ఇంటిపై దాడి చేసి ఆమెను ఎత్తుకెళ్లిన ఘటన అందర్నీ సంప్రమాశ్చర్యాలకు గురిచేసింది. అయితే ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం ఘటన జరిగిన 24 గంటల్లోనే పోలీసులు కిడ్నాపర్ ను అదుపులోకి తీసుకొని యువతిని రక్షించడం జరిగింది.
గత కొన్నాళ్లుగా టీ టైమ్ వ్యవస్థాపకుడు నవీన్ ప్రేమ పేరుతో ఒక యువతని వేధిస్తున్నాడు. ఈ విషయమై ఆమె గతంలో షీ టీంకు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే మధ్యవర్తులతో పెళ్లికి నవీన్ సంప్రదింపులు జరగా ఆ యువత తల్లిదండ్రులు సంబంధానికి ససేమిరా అన్నారు. ఈరోజు ఆ యువతికి పెళ్లిచూపులు జరగవలసి ఉంది. ఈ విషయం తెలుసుకున్న నవీన్ దౌర్జన్యంగా దాదాపు 100 మందితో అమ్మాయి ఇంటిలోకి చొరబడి వస్తువును ద్వంసం చేసి అడ్డుకున్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులపై శారీరకంగా దాడి చేసి మరీ ఆ యువతీని తనతో బలవంతంగా తీసుకుని వెళ్ళాడు. దీంతో స్థానికులు అప్రమత్తమై పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఇక యువతి ఆచూకీ పోవడంతో ఆ కుటుంబం మొత్తం రోడ్డుపై ధర్నాకు దిగారు.
ఎంతో సంచలనంగా మారిన ఈ కేసుకు సంబంధించి ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వర్ రావు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు వెంటనే స్పందించి గాలింపు చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు కిడ్నాపర్ ఆచూకీని కొద్ది గంటల్లోనే కనిపెట్టడం జరిగింది. ఇక కిడ్నాపర్ తో పాటు దొరికిన అతని బృందాన్ని అరెస్టు చేసిన పోలీసులు యువతని క్షేమంగా ఆమె ఇంటిలో కుటుంబ సభ్యుల వద్ద వదిలిపెట్టారు. మరి ఇంతటి ఉన్మాదానికి పాల్పడిన ఆ యువకుడు పై కేసు నమోదు చేయగా అతనికి ఎటువంటి శిక్ష పడుతుంది అన్న విషయం వేచి చూడాలి.
This post was last modified on December 9, 2022 9:44 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…