ఈ స్టోరీ వింటే.. సినిమాటిక్ మలుపులకు ఏ మాత్రం కొదవలేనట్లుగా ఉంటుంది. కానీ.. ఇది రీల్ స్టోరీ కాదు.. రియల్ స్టోరీ. ఈ లవ్ స్టోరీ గురించి పూర్తిగా తెలిసిన తర్వాత వావ్ అనుకోకుండా ఉండలేరు. భారత్ ను చూసేందుకు వచ్చి.. ఒక ఆటో డ్రైవర్ పరిచయం కావటం.. అతగాడి నిజాయితీ.. జీవనశైలి గురించి తెలిసి అతడి ప్రేమలో పడి.. ఇంటికి వెళ్లి పెద్దల అభ్యంతరాల్ని అధిగమించి..ఐదేళ్లు ప్రయత్నాలు చేసింది. చివరకు అనుకున్నట్లే తాను ప్రేమించినోడితో పెళ్లి జరిపించుకున్న ఈ విదేశీ అమ్మాయి కథ ఆద్యంతం ఆసక్తికకరమని చెప్పాలి.
చదువులోనూ.. స్థాయిలోనూ.. సంపదలోనూ భారీ వ్యత్యాసం ఉన్నప్పటికీ.. అతడి నిర్మలమైన మనసును చూసి అతగాడి ప్రేమలో పడిన ఈ ఉదంతంలోకి వెళితే.. బెల్జియంకు చెందిన కెమిల్ ఆ దేశంలో ఒక సామాజిక వేత్తగా మంచి పేరుంది. ఐదేళ్ల క్రితం ఆమె భారత్ ను చూసేందుకు వచ్చింది. తన పర్యటనలో భాగంగా కర్ణాటక విజయనర జిల్లాలోని ప్రముఖ చారిత్రక హంపీకి ఆమె వచ్చారు. ఆ టైంలో అక్కడి స్థానిక ఆటో డ్రైవర్ అనంతరాజుతో పరిచయమైంది. అతడి నిజాయితీ ఆమెను ఆకర్షించింది. అన్నింటికి మించి తన దగ్గర అట్టే డబ్బులు లేకున్నా..తాను సంపాదించిన మొత్తంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించే తీరుకు ఆమె ముగ్దురాలైంది.
దీంతో ఇంటికి వెళ్లిన తర్వాత ఆటోడ్రైవర్ రాజును తాను ప్రేమిస్తున్నట్లుగా తల్లిదండ్రులకు చెప్పింది. మొదట్లో వారు కంగారు పడ్డారు. కూతురు ఇష్టాన్నికాదనలేక ఓకే చేశారు. ఇందులో భాగంగా ఆటో డ్రైవర్ ఇంటికి వచ్చిన వారు.. పెద్దల సమక్షంలో తన ఇష్టాన్ని తెలియజేయటం.. అందుకు ఆటో డ్రైవర్ సైతం తన ఇంట్లో వారిని సంప్రదించి.. ఆమె ప్రేమకు ఓకే చెప్పాడు. వారి పెళ్లిని బెల్జియంలోనే గ్రాండ్ గా చేయాలని భావించారు. అంతలోనే కరోనా మహమ్మారి వచ్చి పడింది.
ఈ గ్యాప్ లో వారి మధ్య బంధం మరింత పెరిగింది. అయితే.. కెమిల్ తల్లిదండ్రులు వేరే అబ్బాయిని ఇచ్చి ఆమెకు పెళ్లి చేయాలని అనుకున్నారు. చివరకు ఆమె మాత్రం ససేమిరా అంది. దీంతో.. ఐదేళ్ల అనంతరం మరోసారి ఆటో డ్రైవర్ రాజు కుటుంబంతో సంప్రదింపులు జరిపి.. పెళ్లికి ఓకే చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లి హంపీలోని విరుపాక్షేశ్వర ఆలయంలో పెద్దలు.. బంధువులు.. ఇరు కుటుంబాలకు చెందిన వారి నడుమ వైభవంగా పెళ్లి జరిగింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో కెమిల్ లవ్ గురించి తెలిసిన వారంతా ఆమెను అభిమానించటం ఖాయం.
This post was last modified on November 26, 2022 11:16 am
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే స్పిరిట్, కల్కి-2 చిత్రాల నుంచి తప్పుకోవడం ఆ మధ్య చర్చనీయాంశంగా మారిన సంగతి…
ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో విమాన, రైలు రవాణా తీవ్రంగా ప్రభావితమైంది. విజిబిలిటీ భారీగా తగ్గిపోవడంతో పలు విమానాలను దారి…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఫలితాలు నిన్న వెలువడిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల ఫలితాల…
సినిమాలకు సంబంధించి క్రేజీ సీజన్లకు చాలా ముందుగానే బెర్తులు బుక్ చేసేస్తుంటారు. తెలుగులో ఏడాది ఆరంభంలో సంక్రాంతి సీజన్కు బాగా…
ఏపీలోని కూటమి ప్రభుత్వంలోనే కాదు.. పార్టీల్లోనూ ప్రక్షాళన జరగనుందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. పార్టీల పరంగా పైస్థాయిలో నాయకులు…
రాజకీయ రంగ ప్రవేశానికి ముందు విజయ్ చివరి సినిమాగా చెప్పుకున్న జన నాయకుడు జనవరి 9 విడుదల కానుంది. మలేసియాలో…