కనని వినని సంఘటన అంటే ఇదేనేమో.. ఇప్పటి వరకు యువతులు, మహిళలపై సామూహిక అత్యాచారాలు జరుగుతున్న ఘటనలు సమాజాన్ని విస్తు గొలుపుతున్న విషయం తెలిసిందే. పూటకొకచోట.. లెక్కన ఈ అత్యాచారాలకు అంతు లేకుండా పోతోందని ఇటు మహిళలు, అటు బాధ్యత గల పురుషులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, పోలీసులు యథాలాపంగా కేసులు పెడుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు.. దిశ-దశ అంటూ చట్టాలు చేస్తూనే ఉన్నాయి. అయితే.. ఇప్పుడు వెరైటీ కేసు వెలుగు చూసింది. దీనిలో పురుషుడు బాధితుడు కావడం గమనార్హం.
మద్యం మత్తులో వచ్చిన యువతులు.. ఓ వ్యక్తిని అడవిలోకి బలవంతంగా తీసుకువెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలను నివ్వెరపోయేలా చేసింది. రోడ్డు మీద నిల్చుని బస్సు కోసం ఎదురుచూస్తున్న తనను కారులో అపహరించి అడవిలోకి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారని ఓ వ్యక్తి గగ్గోలు పెట్టాడు. బాధితుడు పంజాబ్ లోని జలంధర్ వాసి కావడం గమనార్హం. అత్యాచార ఘోరానికి ఒడిగట్టిన యువతులు 20-25 ఏళ్ల లోపువారని తెలిపారు. ఖరీదైన కారులో వారు రావడం, తమలో తాము ఇంగ్లిషులో మాట్లాడుకోవడం చూస్తే పెద్దింటి అమ్మాయిల్లాగా అనిపించారని వివరించాడు.
పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని భార్య హెచ్చరించడంతో తన ఆవేదననంతా స్థానిక మీడియాతో పంచుకున్నాడు! బాధితుడు జలంధర్లోని ఓ లెదర్ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడికి భార్య, పిల్లలున్నారు. ఎప్పటిలాగే సోమవారం రాత్రి కూడా కంపెనీలో విధులు ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు కపుర్తలా రోడ్డులో బస్సు కోసం నిల్చున్నాడు. అంతలోనే అతడి ఎదురుగా ఓ తెల్లరంగు కారు వచ్చి ఆగింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న యువతి, అతడికి ఓ చీటి ఇచ్చి అడ్రస్ చెప్పాల్సిందిగా కోరింది. అతడు ఆ చీటీని పరిశీలిస్తుండగానే వెనక సీట్లో కూర్చున్న యువతులు అతడి కళ్లలో ఏదో రసాయనం చల్లారు.
స్పృహలోకి వచ్చేసరికి కళ్లకు గంతలు కట్టివుండి.. చేతులు కట్టివేసిన స్థితిలో అమ్మాయిల మధ్య కారులో ఉన్నట్లు తెలుసుకున్నాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆ యువతులు.. తననూ తాగాల్సిందిగా ఒత్తిడి చేశారని బాధితుడు ఆరోపించాడు. అడవిలోకి తీసుకెళ్లి. తనకు బలవంతంగా మత్తుమందు ఇచ్చి నలుగురూ తనపై అత్యాచారానికి ఒడిగట్టారని తెలిపాడు. పురుషాంగానికి తాడు కట్టి ఊపారని ఆ బాధను ఓర్చుకోలేక అరుస్తుంటే సెల్‌ఫోన్లలో పాటలు పెట్టుకుని ఎంజాయ్ చేశారని చెప్పాడు.
అనంతరం.. వారు నగ్నంగా మారి.. తనను హత్తుకుంటూ ఎంజాయ్ చేశారని అన్నాడు. అనంతరం.. వారు మత్తులోకి జారుకుని కారులో పడుకున్నాక.. తాను ఎలాగో అలా ప్రాణాలతో ఇంటికి చేరుకున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆత్యాచారం చేయాలనే ఉద్దేశంతోనే నలుగురు యువతులు తనను అపహరించారని చెప్పాడు. ఈ ఘటన మీడియాలో సంచలనమవ్వడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. సదరు యువత కోసం సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రమైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండడం గమనార్హం.
This post was last modified on November 24, 2022 4:01 pm
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…