కేవలం శృంగారం కోసం.. ఓ మహిళ తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను చంపేసి.. తాజాగా పరిచయమైన ప్రియుడితో జంపైపోయింది. ఆమెకు నలుగురు పిల్లలు కూడా ఉండడం గమనార్హం. ఈ ఘటన ఎక్కడో కాదు.. ఏపీలోని నెల్లూరులోనే జరిగింది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన.. నివ్వెరపోయేలా చేసింది.
ఆమెకు పెళ్లైంది.. నలుగురు పిల్లలు ఉన్నారు.. అయినా సరే మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇంకేముంది ప్రేమించి పెళ్లి చేసుకున్నామన్న విషయాన్ని కూడా మరిచిపోయి.. అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని ప్లాన్ వేసింది. ప్రియుడితో కలిసి భర్తను చంపేసి.. బస్తాలో మూట కట్టి చెరువులో పడేసింది. నాలుగు రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన నెల్లూరు జిల్లాలో సంచలనం రేపింది.
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాళెం గ్రామానికి చెందిన శోభ, మణి అనే వ్యక్తిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. ఈ దంపతులు పంటపాళెం గ్రామంలో నివాసముంటున్నారు. రొయ్యల గుంట వద్ద కాపలాగా ఉంటూ జీవనం సాగిస్తున్న వీరికి నలుగురు పిల్లలున్నారు. సాఫీగా సాగుతున్న వీరి జీవితంలో.. భరత్ అనే వ్యక్తి ప్రవేశించాడు.
శోభ, భరత్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడటంతో.. కాపురంలో కలతలు మొదలయ్యాయి. ప్రియుడు భరత్పై మోజు పెంచుకున్న శోభ.. భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. నాలుగు రోజుల క్రితం ప్రియుడు భరత్, మరో ముగ్గురు వ్యక్తుల సాయంతో గ్రామ సమీపంలోని నక్కల కాలువ వద్ద మణిని గొంతు నులిమి చంపేశారు.
మృతదేహాన్ని గోతం సంచిలో మూటగట్టి నీటి ప్రవాహం అధికంగా ఉండే నక్కల కాలువలో పడేశారు. కాలువలో గోతాం సంచిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోగి దిగిన పోలీసులు గోతామును బయటకు తీసి మణి మృతదేహంగా గుర్తించారు. పోలీసులు ప్రాథమిక విచారణలో ఈ హత్య చేసింది భార్య శోభనేనని నిర్ధారించి, వారిని అదుపులోకి తీసుకున్నారు.
This post was last modified on November 21, 2022 11:28 am
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…