Trends

ఇవేం వెడ్డింగ్ ఫొటో షూట్లు బాబోయ్

ఒకప్పుడు పెళ్లి తంతు జరుగుతుండగా మాత్రమే పొటోలు తీసేవారు. ఆ తర్వాత పెళ్లి జరగడానికి ముందు వధూవరులతో కళ్యాణ మండపంలోనే రకరకాల పోజులు ఇప్పించి ఫొటోలు తీయడం చూశాం. గత కొన్నేళ్ల నుంచి పెళ్లికి ముందు రకరకాల ప్రదేశాల్లో.. అనేక థీమ్స్‌తో ఫొటోలు తీయడం చూస్తున్నాం.

ప్రి వెడ్డింగ్ ఫొటోగ్రఫీ అనేది ఇప్పుడు పెద్ద బిజినెస్ అయిపోయింది. లక్షలు పోసి ఈ ఫొటో షూట్లు చేయించుకుంటున్నాయి కొత్త జంటలు. ఒక దశ వరకు ఇవి సంప్రదాయ బద్ధంగానే సాగాయి కానీ.. ఈ మధ్య ఈ ఫొటో షూట్లు మరీ శ్రుతి మించి పోతుండడం గమనించవచ్చు. బురదలో ఫొటో షూట్లు దిగడం.. రొమాన్స్ పేరుతో హద్దులు దాటిపోతుండడం చూసి నెటిజన్లు షాకైపోతున్నారు. ఇప్పుడు ఈ ఫొటో షూట్లలో రొమాన్స్ మరింత శ్రుతి మించుతోంది.

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఫొటో షూట్లు నెటిజన్ల మతి పోయేలా చేస్తున్నాయి. ఒక జంట బాత్రూంలో దిగిన రొమాంటిక్ ఫొటోలు హాట్ టాపిక్ అవుతున్నాయి. బాత్ టబ్‌లో ఒకరి ఒళ్లో ఒకరు కూర్చుని.. షవర్లో తడుస్తూ.. నురుగ మీద వేసుకుని ఇచ్చిన పోజులు చూసి ఎలా స్పందించాలో తెలియట్లేదు జనాలకు. ఇక ఇంకో జంట ఔట్ డోర్లో ఘాటు రొమాన్సుతో చేసిన ఫొటో షూట్ ఇంకో లెవెల్ అనే చెప్పాలి.

మరో ఫొటో షూట్లో వరుడు షాంపేన్ తాగుతుంటే కింద అతడి ప్యాంటు విప్పి వధువు ఏదో చేస్తున్నట్లుగా ఇచ్చిన పోజు మిగతా ఫొటో షూట్లన్నింటికీ బాప్ అనే చెప్పాలి. ప్రి వెడ్డింగ్ ఫొటో షూట్లంటే సరదాగా, కొంచెం రొమాంటిగ్గా ఉండాలి కానీ.. ఇలా శ్రుతి మించిన రొమాన్స్, వల్గర్‌గా అనిపించే పోజులు చేసి ఇదేం పైత్యం అని జనాలు విస్తుబోతున్నారు.

This post was last modified on November 19, 2022 10:28 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

4 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

6 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

7 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

7 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

7 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

7 hours ago