ఇప్పటి వరకు ఉచితంగా అందుతున్న ట్విట్టర్ సేవలకు మస్క్ రేటు కట్టారు. ఇటీవలే టేకోవర్ చేసిన ట్విట్టర్‌పై ఆయన బిజినెస్ చేసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో ట్విట్టర్ ఇక ఖరీదు కానుంది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ వెళ్లాక ఆ సంస్థ రూల్స్లో అనేక మార్పులు జరగనున్నాయి. ఇప్పుడు బ్లూ బ్యాడ్జ్ ఫీచర్‌లోనూ మస్క్ కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపై బ్లూ టిక్ కావాలంటే నెలకు రూ.1600 చెల్లించాల్సి ఉంటుందని అనధికారికంగా తెలుస్తోంది. దీనిపై మస్క్ ప్రకటన చేయనున్నారు.
ట్విట్టర్ను హస్తగతం చేసుకున్న వెంటనే ఎలాన్ మస్క్ సంస్థ సంబంధిత విషయాల్లో సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఉద్యోగులను తొలగించారు. ఇంకా తొలగిస్తానని కూడా ప్రకటించారు. ఇక, ఇప్పుడు వినియోగదారులపై ఆయన పడ్డారు. బ్లూ బ్యాడ్జ్ ఫీచర్‌లోనూ కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్ యూజర్లకు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిగా మారిపోతుందని తాజాగా మస్క్ ట్వీట్ చేశారు.
వెరిఫైడ్ అకౌంట్ కలిగి ఉండాలని భావించే వారు అంటే బ్లూ టిక్ కోరుకునే వారు ఇకపై చార్జీలు చెల్లించుకోవాల్సి వస్తుందని సమాచారం. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ఈ దిశగా ప్రణాళికలు రచిస్తోందని తెలుస్తోంది. నెలకు 19.99 డాలర్లు చెల్లించాల్లిందేనని నిపుణులు చెబుతున్నారు. మన కరెన్సీలో చెప్పుకుంటే నెలకు దాదాపు రూ.1600 కట్టాల్సి ఉంటుంది.
ఒకవేళ సబ్‌స్క్రిప్షన్ తీసుకోకపోతే బ్లూ టిక్ కేవలం 90 రోజులే ఉంటుంది. ఈ కొత్త రూల్‌ను నవంబర్ 7 నాటికి అమలులోకి తీసుకువచ్చే దిశగా మస్క్ యోచిస్తున్నట్లు తెలిసింది. సంబంధిత పనులు పూర్తి చేయకపోతే ఈ ప్రాజెక్టులో ఉన్న ఉద్యోగులందరినీ ఇంటికి పంపించేందుకు ఆయన సిద్ధం అయినట్లు సమాచారం. 2021లో ట్విట్టర్ బ్లూ టిక్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ట్విట్టర్ బ్లూ టిక్ కలిగిన వారికి ప్రీమియం ఫీచర్లు లభిస్తాయి. ట్వీట్స్‌ను ఎడిట్ చేసుకోవడం సహా పలు రకాల సర్వీసులు పొందొచ్చు.
This post was last modified on October 31, 2022 3:44 pm
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…