హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. డబీర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గ్యాంగ్ రేప్ ఉదంతం షాకింగ్ గా మారింది. పదమూడేళ్ల చిరుప్రాయంలో ఉన్న బాలికను.. ఆమె నివసించే ప్రాంతానికి చెందిన కొందరు కిడ్నాప్ చేసి.. రెండు రోజుల పాటు గ్యాంగ్ రేప్ నకు పాల్పడినట్లుగా చెబుతున్నారు.
చంచల్ గూడకు చెందిన పదమూడేళ్ల ఒక మైనర్ బాలికను అదే ప్రాంతానికి చెందిన యువకులు కారులో వచ్చి ఆమెను కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెను నాంపల్లిలోని ఒక లాడ్జికి తీసుకెళ్లారు. అక్కడ బాలికకు మత్తు మందు ఇచ్చి రెండు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాలికను అక్కడే వదిలేసి.. పరారయ్యారు.
స్ప్రహలోకి వచ్చిన బాధిత బాలిక తనకు జరిగిన దారుణం గురించి ఇంట్లో వారికి చెప్పటంతో.. బాలిక తల్లిదండ్రులు డబీర్ పుర పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో ఇప్పటివరకు ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. ఈ ఇద్దరు నిందితులు బాధితురాలికి తెలిసిన వారు కావటం గమనార్హం. ఈ కేసుకు సంబంధించిన వివరాల్ని పోలీసులు వెల్లడించాల్సి ఉంది. గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా చెప్పిన నేపథ్యంలో బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపారు.
This post was last modified on September 15, 2022 2:06 pm
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…