వివాహాలు.. అనేవి.. దేవుడు నిర్ణయిస్తాడని అంటారు కదా! మరి.. ఇప్పుడు జరిగిన ఈ వివాహం కూడా ఆ దేవుడే నిర్దేశించాడా? ఇదీ.. ఇప్పుడు ఈ ఘటన గురించి చదివిన తర్వాత.. మనకు మెదిలే ప్రశ్న. ఎందుకంటే.. ఇద్దరు యువతులు పెళ్లి చేసుకోవడం.. ఇద్దరు యువకులు పెళ్లి చేసుకోవడం.. ఇప్పుడు ఫ్యాషన్, కామన్ అయిపోయింది. కానీ, ఇప్పుడు ఈ ఘటనలో ఇద్దరు మహిళలు పెళ్లిచేసుకున్నారు. అది కూడా ఇరు కుటుంబాలను ఒప్పించి.. అందునా.. అత్యంత సంప్రదాయ బద్ధంగా.. భూదేవంత అరుగువేసి.. ఆకాశమంత పందిరి వేసి..! దీంతో ఈ వివాహ వేడుక.. దేశవ్యాప్తంగా.. సంచలనంగా మారింది.
పెద్దవారిని ఒప్పించి మరీ ఇద్దరు మహిళలు ఒక్కటయ్యారు. సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. తమిళనాడు చెన్నైలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సుభిక్షా సుబ్రమణ్యం(29) అనే మహిళ తమిళనాడులో జన్మించింది. 19 ఏళ్లు వచ్చేసరికి ఆమెకు హార్మోన్లలో మార్పు కారణంగా పురుష లక్షణాలు వచ్చాయి. ఆమె ప్రస్తుతం కెనడాలోని కాల్గెరీలో చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేస్తోంది. సుభిక్షా కొన్ని రోజులు ఖతార్లో ఉంది. అనంతరం కెనడా వెళ్లి.. తన శరీరంలో వచ్చిన మార్పుల గురించి ఆమె తల్లికి చెప్పింది. అదే నయం అవుతుందని తల్లి ఓదార్చింది.
బంగ్లాదేశ్కు చెందిన టీనా దాస్ హిందూ కుటుంబంలో జన్మించింది. పెళ్లి చేసుకుని నాలుగు సంవత్సరాలు భర్తతో ఉంది. తర్వాత తాను స్వలింగ సంపర్కురాలు(లెస్బియన్) అని గ్రహించి భర్తను వదిలేసింది. టీనా కూడా కాల్గెరీలోని ఓ ఆస్పత్రిలో సహాయకురాలిగా పనిచేస్తోంది. అయితే ఓ మొబైల్ యాప్ ద్వారా సుభిక్షా, టీనా స్నేహితులయ్యారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ ఇళ్లలో ఈ పెళ్లి గురించి ప్రస్తావించారు. మొదట తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కొన్ని నెలల తర్వాత పెళ్లికి అంగీకరించారు. దాంతో ఇద్దరూ చెన్నైలో పెళ్లి చేసుకున్నారు. అది కూడా అత్యంత సంప్రదాయ బద్ధంగా కావడం విశేషం.
This post was last modified on September 7, 2022 10:43 am
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…