Trends

రెండో పెళ్లి వద్దంటే జైలుశిక్షే..

మీరు చదివిన హెడ్డింగ్ కరెక్టే. రెండో పెళ్లి చేసుకోకపోతే జీవిత ఖైదు శిక్ష వేస్తారా ? రెండు పెళ్లిళ్లు చేసుకోవటం చట్టప్రకారం తప్పు కదా ? అని అనుకుంటున్నారు. మనదేశంలో అయితే తప్పు కావచ్చు కానీ ఆ దేశంలో మాత్రం రెండో పెళ్లి చేసుకోకపోతే తప్పు. ఓహ్ ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా ? తూర్పు ఆఫ్రికా లోని ఎరిత్రియా దేశంలో. మనదేశంలో రెండో పెళ్లి చేసుకోవటం చట్టప్రకారం తప్పే. అంటే మొదటి భార్యతో కలిసుంటూనే రెండోపెళ్లి చేసుకోవటం తప్పు.

అయితే వివాహం చేసుకోకుండానే మరో స్త్రీతో కలిసుండటం, మొదటి భార్యకు తెలీకుండానే రెండో వివాహం చేసుకోవటం మనదేశంలో ఈ మధ్యలో బాగా పెరిగిపోతోంది. ఇదే సమయంలో మహిళల్లో కొందరు కొంతమంది పురుషుల్లాగా తయారైపోతున్నారులేండి. ఇక ఎరిత్రియా గురించి మాట్లాడుకుంటే అక్కడ ప్రతి మగాడు కచ్చితంగా రెండో పెళ్లి చేసుకోవాల్సిందే. లేదు లేదు తనకిష్టం లేదు చేసుకోనంటే కుదరదు. రెండు పెళ్లిళ్లు చేసుకోని మగాడు నేరస్ధుడిగానే లెక్క.

విచిత్రం ఏమిటంటే ఎరిత్రియాలో రెండు వివాహాలు చేసుకోవాల్సిందే అని ప్రత్యేకమైన చట్టమే ఉంది. భర్త రెండో వివాహం చేసుకోవటానికి మొదటిభార్య కూడా అనుమతించాల్సిందే తప్ప వేరే దారి లేదు. వివాహం తర్వాత ఇద్దరు భార్యలను భర్త సక్రమంగా చూసుకోవాల్సిందే. ఎన్నో సంవత్సరాలుగా ఈ దేశంలో రెండు వివాహాల చట్టం అమలవుతునే ఉంది. ఇంతకీ ఆ దేశంలో రెండు వివాహాలచట్టం ఎందుకు వచ్చిందంటే అక్కడ పురుషుల జనాభా కన్నా మహిళల జనాభా చాలా ఎక్కువట.  

ప్రతి మగాడు ఒక స్త్రీని మాత్రమే వివాహం చేసుకోవాలంటే చాలామంది స్త్రీలకు అసలు వివాహయోగమే దక్కటం లేదట. దీంతో మహిళల సంక్షేమాన్ని, చట్టబద్దమైన  సంతానాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఇలాంటి చట్టం చేసిందట. చైనా, మనదగ్గర ఇలాంటి సమస్య ఇప్పటికైతే లేనందుకు సంతోషించాల్సిందే. కొంతకాలం అయితే ఎరిత్రియా ప్రభుత్వం చేసిన చట్టాలే చాలా దేశాల్లో వస్తాయేమో చూడాలి. 

This post was last modified on August 21, 2022 11:38 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

4 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

6 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

7 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

7 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

8 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

8 hours ago