కేంద్ర ప్రభుత్వం అనుమతితో.. భారత్ లో గూగుల్ స్ట్రీట్ వ్యూ మళ్లీ అందుబాటులోకి వచ్చింది. దీంతో చిన్న చిన్న గల్లీలు కూడా స్పష్టంగా 360 డిగ్రీల కోణంలో చూడొచ్చు. 2011లోనే గూగుల్ స్ట్రీట్ వ్యూ సేవలు భారత్లోకి వచ్చినప్పటికీ.. భద్రతాపరంగా ముప్పు పొంచి ఉందన్న కారణంతో 2016లో దీనిపై నిషేధం విధించింది. ఈ సేవల వల్ల ఉగ్రమూకలు సులువుగా రక్షణ శాఖకు చెందిన వివరాలను తెలుసుకునే అవకాశం కల్పిస్తుందన్న భావన అప్పట్లో వ్యక్తమవగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
చిన్న చిన్న రహదారులు, అక్కడున్న ఇళ్లు.. చిన్న చిన్న వీధులు.. 360 డిగ్రీల కోణంలో కళ్లకు కట్టినట్లు గా చూపించేందుకు గూగుల్ స్ట్రీట్ వ్యూ ఉపయోగపడుతుంది. దీంట్లో.. మన ఇల్లు కూడా కనిపిస్తుంది. అది వ్యక్తుల గోప్యతకు భంగం కలిగించొచ్చు. అందుకే.. ఈ స్ట్రీట్ వ్యూతో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. దానిని అడ్డుకోవాలంటే.. మీ ఇల్లు కనిపించకుండా బ్లర్ చేయాలి. అదేవిధంగా కొంత మంచి కూడా ఉంది. మొత్తంగా చూస్తే.. ఇది ఎంతవరకు మేలు చేస్తుంది? ఎంత వరకు కీడు చేస్తుందనేది ఆసక్తిగా మారింది.
స్థానిక టెక్ సంస్థలైన టెక్ మహీంద్రా, జెనిసిస్‌తో జట్టు కట్టి తాజాగా గూగుల్ మళ్లీస్ట్రీట్ వ్యూను తీసుకొచ్చింది. హైదరాబాద్ సహా తొలుత 10 నగరాల్లో ఈ సేవలను ప్రారంభించింది. ఈ ఏడాది చివరి నాటికి 50 నగరాల్లో ఈ సేవలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు గూగుల్ తెలిపింది.
అయితే.. ఈ ఫీచర్తో మీ ఇల్లు కూడా స్ట్రీట్ వ్యూలో కనిపిస్తుంది. సాధారణంగా గూగుల్ మ్యాప్స్లో వీధులను జూమ్ చేసి చూస్తున్నపుడు కొన్ని వస్తువులు, ముఖాలు అస్పష్టంగా కనిపిస్తుంటాయి. ఇదే ప్రైవసీగా ఉంచడం. మీరూ అలా చేసుకోవచ్చు. స్ట్రీట్ వ్యూలో మీ ఇంటిని కనిపించేలా ఉంచినట్లయితే.. అపరిచిత వ్యక్తులకు అవకాశం కల్పించినట్లే అవుతుంది.
దొంగలు, చొరబాటుదారులు లేదా ఇతర వ్యక్తులు మీ భవనానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఎలా ప్రవేశించాలి వంటి అంశాలపై పూర్తి అవగాహనకు వచ్చే అవకాశముంది. ఇప్పటికే స్పష్టంగా కనిపించకపోయినా.. అపరిచిత వ్యక్తులకు మీ ఇంటికి సంబంధించిన కొంతైనా సమాచారం గూగుల్ మ్యాప్స్ ఇచ్చే ఉంటుంది.ముఖ్యంగా.. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగినట్లే.. మీ కదలికల్ని స్ట్రీట్ వ్యూతో పసిగట్టే ఆన్లైన్ స్టాకర్లు ఉంటారు. వీటి ఆధారంగా వారు డబ్బులు డిమాండ్ చేయొచ్చు. ఇవే కాకుండా గూగుల్ మ్యాప్స్ను చాలా వరకు దుర్వినియోగం చేసే ఛాన్స్ ఉంది.
ఇక, దీనివల్ల జరిగే మంచి విషయానికి వస్తే.. స్ట్రీట్ వ్యూతో వాహనం ఎక్కడ పార్కింగ్ చేస్తున్నారన్నది చూడొచ్చు. అదేవిధంగా మనకు తెలియని ప్రాంతాలకు వెళ్లినప్పుడు.. సంబంధిత అడ్రస్‌ను తెలుసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వ్యక్తులను కూడా గుర్తు పట్టే ఛాన్స్ ఉంది. ఇది తప్ప.. పెద్దగా మేలు లేదని నిపుణులు చెబుతున్నారు. మరిదీనిపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండానే.. కేంద్రం ఇలా అనుమతులు ఇవ్వడం ఏంటనేది ఇప్పడు చర్చకు వస్తున్న విషయం.
This post was last modified on August 8, 2022 8:00 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…