రణవీర్ సింగ్ మరియు ఆలియ భట్ తో మొదలు పెట్టి, ఝాన్వి కపూర్, సారా ఆలీ ఖాన్ తో దానిని తారా స్థాయికి తీసుకెళ్ళి, విజయ్ దేవరకండి, అనన్య పాండేలతో చాలా మాట్లాడించి.. చివరకు ఓల్డ్ ఏజ్ క్యాటగిరీలోకి స్లిప్ప అవుతున్న కరీనా కపూర్ మరియు ఆల్రెడీ ఐదు పదులు దాటిన ఆమీర్ ఖాన్ తో కూడా సేమ్ ”సెక్స్” పాటే పాడించేశాడు కరణ్ జోహార్. ఇతగాడు నిర్వహించే ”కాఫీ విత్ కరణ్” టాక్ షో సీజన్ 7 మొత్తం ఇప్పుడు శృంగారభరిత డిస్కషన్లా తయారైంది. ఒకప్పుడు స్వాతి మ్యాగజైన్ లో పాపులర్ అయిన ‘సుఖసంసారం’ కాలమ్న్ ను తలపిస్తోంది.
ఈ సీజన్ మొత్తంగా కరణ్ జోహార్ ఏ హీరో ఏ హీరోయిన్ తో రిలేషన్లో ఉన్నాడు లేదా ఏ నటీమణి ఎవర్ని డేటింగ్ చేస్తోంది అనే విషయంకంటే.. అసలు ఎవరు ఎవరితో సెక్స్ చేస్తున్నారు అనేదానిపైనే ఫోకస్ చేశాడు. ఆఖరిగా సెక్స్ ఎప్పుడు చేశావ్? కార్లో సెక్స్ ఎందుకు చేశావ్ అంటూ విజయ దేవరకొండతో పరాచికాలు ఆడి..
‘Hey, You Up?’ అంటూ అర్ధరాత్రి ఎవరికి మెసేజ్ పెట్టారు అంటూ ఝాన్వి, సారా ఆలీ ఖాన్ లను కొంటె ప్రశ్నలడిగాడు. మాజీ లవ్వర్ తో మళ్ళీ సెక్స్ చేస్తావా అంటూ సారా ఆలీ ఖాన్ ను ఇంకొంచెం డీప్ గా గుచ్చేశాడు కరణ్. వాళ్లు కూడా అంతకంటే కొంటెగా, ఒక వర్గం ఆడియన్స్ కు కాస్త చికాకు కల్పించేలా ఆన్సర్లు చెప్పేశారు కూడా. ఇకపోతే కొంతమంది స్టార్లు ప్రస్తుతం ఎవరితో సెక్స్ చేస్తున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నం చేశాడు. ఆలియాభట్ తో మాత్రం పెళ్ళయ్యాక సెక్స్ ఎలా ఉంది అనే విధంగా మాట్టాడేలా చేశాడు.
చివరకు ఆమీర్ ఖాన్ ను కూడా మనోడు అదే ప్రశ్న అడుగుతున్నాడంటే.. వామ్మో అనుకోవాల్సిందే. ఆమీర్-కరీనా వచ్చిన ఎపిసోడ్ లో మనోడు ఏకంగా పెళ్ళయ్యిన తరువాత ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత సెక్స్ పరిస్థితేంటి అనే ఛందంగా కరీనాకు ఒక ప్రశ్న వేశాడు. తను జవాబు ఏం చెప్పిందో తెలియదు కాని, కరణ్ మాత్రం, ఈ షో మా అమ్మ చూస్తే నా సెక్స్ లైఫ్ గురించి ఏమనుకుంటుందో అన్నట్లు రిప్లయ్ ఇచ్చాడు. దానికి వెంటనే ఆమీర్ స్పందిస్తూ.. ”మరి నువ్వు ఇతరుల సెక్స్ లైఫ్ గురించి మాట్లాడితే మీ మమ్మీకి ఓకెనా?” అంటూ పెద్ద పంచే వేశాడు.
ఏదేమైనా కూడా, కాఫీ విత్ కరణ్ కాస్త ‘కాఫీ అండ్ సెక్స్ టాక్ విత్ కరణ్’ అనే ప్రోగ్రామ్ తరహాలో మార్చేశాడు ఈ కమర్షియల్ దర్శకుడు మరియు నిర్మాత. క్రేజ్ కోసం బాలీవుడ్లో ఏదైనా చేస్తారులే. అందులో మనోడు మొదటి వరుసలో పెద్ద కుర్చీయే వేసుకుని కూర్చున్నాడని అర్ధమవుతోంది.
This post was last modified on August 3, 2022 2:15 pm
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…
ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా…