భారత క్రికెట్ అనే కాక ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడైన విరాట్ కోహ్లికి ఇప్పుడు గడ్డు కాలం నడుస్తోంది. ఒకప్పుడు అలవోకగా సెంచరీల మీద సెంచరీలు కొట్టేసిన అతను.. రెండున్నరేళ్లకు పైగా ఏ ఫార్మాట్లోనూ ఒక్కసారి కూడా మూడంకెల స్కోరు చేయలేదు. ఇటు అంతర్జాతీయ క్రికెట్లో, అటు ఐపీఎల్‌లో అతను విఫలమయ్యాడు. అందులోనూ ఈ మధ్య అతడి ప్రదర్శన మరీ తీసికట్టుగా తయారైంది. ఇంగ్లాండ్‌తో చివరి టెస్టులో, ఆ తర్వాత ఆడిన రెండు టీ20 మ్యాచ్‌ల్లో అతను ఫెయిలయ్యాడు.
ఇంతకుముందు సెంచరీల కోసం చూసిన అభిమానులు.. అతను ఒక 50 కొట్టినా చాలని చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ కోహ్లి వల్ల అది కూడా అవ్వట్లేదు. ఈ నేపథ్యంలో జట్టులో చోటే ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ ఏడాది చివర్లో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం చాలా మంది యువ ఆటగాళ్లు పోటీలో ఉండడం, ప్రతి చిన్న అవకాశాన్నీ వాళ్లు ఉపయోగించుకుంటుండడంతో కోహ్లి మీద ఒత్తిడి పెరిగిపోతోంది. కపిల్ దేవ్, సెహ్వాగ్ లాంటి వాళ్లు కోహ్లిని టీ20 జట్టు నుంచి తప్పించాలని డిమాండ్ చేయడం గమనార్హం.
ఇలాంటి సమయంలోనే కోహ్లి.. ఇంగ్లాండ్‌తో మంగళవారం జరిగిన తొలి వన్డేకు అనుకోని విధంగా దూరమయ్యాడు. అతడికి గాయమైందని ముందు రోజే వార్త బయటికి వచ్చింది. ఐతే గాయం పేరు చెప్పి ఆటగాళ్లను పక్కన పెట్టడం ఇండియన్ క్రికెట్లో కొన్నిసార్లు జరిగిన మాట వాస్తవం. కోహ్లి విషయంలోనూ ఇదే జరిగింది అనే అర్థం వచ్చేలా ‘ఇంగ్లాండ్ బార్మీ ఆర్మీ’ అనే వెరిఫైడ్ హ్యాండిల్ నుంచి పోస్టు పెట్టడం సోషల్ మీడియాలో కలకలం రేపింది. ఇంగ్లాండ్ క్రికెట్‌కు మద్దతుగా నడిపే ఈ హ్యాండిల్ ట్విట్టర్లో చాలా ఫేమస్. అలాంటి వెరిఫైడ్ హ్యాండిల్ నుంచి.. కోహ్లిని అవమానించేలా పోస్టు పెట్టారు.
‘dropped’ అనే పదానికి ‘Abdomen groin injury’ అని అర్థం అని ఆ పోస్టులో పేర్కొన్నారు. విరాట్‌పై వేటు వేసి గాయం కారణమని చెప్పారన్నది ఈ పోస్టు ఉద్దేశం. ఇది కోహ్లి అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వాళ్లు కోహ్లి రికార్డులన్నీ బయటికి తీసి.. ఇంగ్లాండ్ ఆటగాళ్లతో పోలుస్తూ ఇది మా వాడి రేంజ్ అని ఎదురు దాడి చేశారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టులోని అందరు బ్యాట్స్‌మెన్ కంటే వన్డేల్లో కోహ్లి ఒక్కడి పరుగులు, సెంచరీలు ఎక్కువ అని.. ఈ మధ్య ఏదో ఫామ్‌తో కొంచెం తంటాలు పడుతుంటే ఇలా అవమానిస్తారా అంటూ ఇంగ్లాండ్ మద్దతుదారులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కోహ్లి ఫ్యాన్స్. దెబ్బకు ఆ పోస్టును ఇంగ్లాండ్ బార్మీ ఆర్మీ డెలీట్ చేసేసింది.
This post was last modified on July 13, 2022 6:18 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…