నేను బాగుండాలనుకోవటం ‘బీసీ’ (బిఫోర్ కరోనా) మాట. ఇప్పుడు పక్కనోడు బాగుండాలనుకోవటం ‘ఎసీ’ (ఆఫ్టర్ కరోనా) మాట. నువ్వు బాగుండాలంటే పక్కనోడు కచ్ఛితంగా బాగుండాల్సిందే. అప్పుడు మాత్రమే నువ్వు క్షేమంగా బతికి బట్టకట్టగలుగుతావు. భయపడటం వేరు. జాగ్రత్తగా ఉండటం వేరు. ఈ రెండూ ఒకటే అనుకొని తప్పులు చేసేటోళ్లు చాలామంది కనిపిస్తారు.
నిజానికి.. ఈ భావనే హైదరాబాద్ ను కరోనాకి కేరాఫ్ అడ్రస్ గా మార్చేస్తోంది. వెయ్యి కేసులు నమోదు కావటానికి నెలలు పడితే.. అందుకు భిన్నంగా ఇప్పుడు రోజులో వెయ్యి కేసుల పైన నమోదు కావటం చూస్తే.. పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందన్నది ఇట్టే అర్థమవుతుంది.
మరి.. ఇలాంటి పరిస్థితిని మార్చాలంటే ఏం చేయాలి? ఎలా ఉంటే.. ముప్పు నుంచి తప్పించుకుంటామన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి వందలు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని.. కాస్తంత జాగ్రత్త.. మరికాస్త మర్యాదగా వ్యవహరిస్తే సరిపోతుందంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాలు బయట పెట్టి.. మళ్లీ ఇంటికి వచ్చే లోపు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అందుకే.. అప్రమత్తతకు మించింది మరొకటి లేదన్న మాట బలంగా వినిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే.. కరోనా ముప్పు తీవ్రమైంది. కేసులు నమోదవుతున్న తీరు చూస్తే.. వైరస్ వ్యాప్తి తర్వాతి దశకు వెళ్లినట్లుగా అనిపించక మానదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని.. అధికారుల్ని వేలెత్తి చూపించటం మానేసి.. ప్రతి ఒక్కరు తమకు తాము ఏమేం చేయగలమో అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరికి వారు.. తాము తప్పక పాటించాల్సిన కర్తవ్యాలుగా భావిస్తే.. ఈ దశలోనూ కరోనాకి చెక్ చెప్పటం అంత కష్టమైన పని కాదు. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తామేం చేయాలని అనుకోవాలంటే?
— బయటికు అడుగు పెడితే మాస్కుతోనే వెళతా
— ఇతరులకు 2 మీటర్ల దూరంలో నిలబడి మాట్లాడతా
— ఎంతో అవసరం ఉంటే తప్పించి ఇంట్లో నుంచి బయటకు వెళ్లను
— ఎదుటి వారు బాగుండాలని.. క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా
— నాకు వ్యాధి లక్షణాలు లేకున్నా.. నా కారణంగా వైరస్ సోకే ఛాన్స్ ఉందని మీరు తెలుసుకోవాలి.
— నేను కరోనా భయంతో జీవించాలనుకోను
— నేను సమస్యలో కాదు.. పరిష్కారంలో భాగస్వామినికావాలనుకుంటున్నా
— ప్రభుత్వం ఏం చెప్పినా అది.. నా మంచి కోసమే
— చుట్టూ ఉన్న ప్రపంచం బాగోవాలంటే అందరిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే నేను అడుగు వేయాలి
— మాస్క్ పెట్టుకోవటం.. శానిటైజర్ వాడటం.. గంటకోసారి చేతుల్ని శుభ్రంగా కడుక్కోవటం పిరికివాడిననో.. చేతకానివాడిననో.. ఉత్తనే భయపడే వాడిననో అనుకోవటం లేదు. నా చుట్టూ ఉన్న వారంతా క్షేమంగా ఉండాలని మాత్రమే కోరుకునేవాడ్ని.
This post was last modified on June 30, 2020 9:05 am
కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన అనేక మందికి సర్కారు ఏర్పడిన తర్వాత.. నామినేటెడ్ పదవులతో సంతృప్తి కలిగిస్తున్నారు. ఎన్ని…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక…
ఏపీ ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో అతి…
కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విషయంలో…
త్రిభాషా విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకున్న సంగతి తెలిసిందే. జనసేన…