తరచూ వార్తల్లో ఉంటారు ప్రముఖ మీడియా దిగ్గజం రూపక్ మర్దోక్. తన కన్ను పడిన ఏ సంస్థను అయినా తన సొంతం చేసుకోకపోతే ఒక పట్టాన నిద్ర పట్టని ఈ పెద్ద మనిషి వ్యాపారంలోనే కాదు వ్యక్తిగత అంశాల్లోనూ రోటీన్ కు భిన్నంగానే వ్యవహరిస్తుంటారు. తాజాగా ఆయన తన నాలుగో భార్యకు విడాకులు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. న్యూయార్కు టైమ్స్ కథనం ప్రకారం ప్రముఖ మోడల్ కమ్ నటి జెర్రీ హాల్ ను 2016లో లండన్ లో పెళ్లాడారు మర్దోక్. తాజాగా తన నాలుగో భార్యకు ఆయనకు విడాకులు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా మీడియా సామ్రాజ్యాన్ని విస్తరించిన మర్దోక్ ఆస్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం చూస్తే.. ఆయన ఆస్తులు సుమారు రూ.1.38 లక్షల కోట్లు. మర్దోక్ తన మొదటి భార్య పాట్రిసియాతో 1966లో విడిపోయారు. ఆమె ఫ్లైట్ అటెండెంట్ గా పని చేసేది. తర్వాత రెండో భార్య అన్నాతో 1999లోవిడిపోయారు. మూడో భార్య వెండీ డెంగ్ తో 2014లో విడిపోయి.. జెర్రీ హాల్ ను 2016లో పెళ్లాడారు. తాజాగా ఆ పెళ్లి సైతం పెటాకులైంది.
ఏమైనా ముదిమి వయసులో తనకు తోడుగా ఉన్న భార్యను వదులుకోవటానికి ఇష్టపడరు. మరి.. మర్దోక్ మాత్రం అందుకు భిన్నంగా నాలుగో భార్యకు విడాకులు ఇచ్చారు. అమెరికా.. యూకే.. ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాల్లో ప్రముఖ వార్తా సంస్థల్ని సొంతం చేసుకున్న ఈ మీడియా మొఘల్ కు ప్రముఖ మీడియాసంస్థల్లో భారీ వాటాలే ఉన్నాయి. 91 ఏళ్ల వయసులో మరోసారి పెళ్లి చేసుకుంటారో ఏమిటో చూడాలి.
This post was last modified on June 24, 2022 12:06 pm
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…