దశాబ్దాల పాటు ప్రపంచ ప్రజల్ని వణికించిన హెచ్ ఐవీ – ఎయిడ్స్ మహమ్మారి పీచమణిచే రోజులు దగ్గరకు వచ్చేసినట్లే. కొన్నేళ్ల పాటు ఈ వ్యాధికి చికిత్స ఏమీ లేని పరిస్థితుల్లో వేలాది మంది కన్నుమూయటం తెలిసిందే. తాజాగా ఈ వ్యాధి బారిన పడిన వారిని రక్షించేందుకు వీలుగా శాస్త్ర అద్భుతాన్ని ఆవిష్కరించారు శాస్త్రవేత్తలు. చికిత్స లేని హెచ్ ఐవీ ఎయిడ్స్ ను కట్టడి చేసేందుకు వీలుగా ఇంజెక్షన్ సిద్ధమైనట్లుగా చెబుతున్నారు.
ఈ అద్భుతాన్ని ఆవిష్కరించిన ఘనత ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలకు దక్కుతుందని చెప్పాలి. జన్యువుల ఎడిటింగ్ విధానాన్ని ఉపయోగించిన ఇప్పటివరకు కొరుకుడుపడని ఈ వ్యాధికి చెక్ చెప్పే వ్యాక్సిన్ ను సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన పరిశోధన ఫలితాల్ని తాజాగా వెల్లడించింది నేచర్ జర్నల్. ఈ వ్యాక్సిన్ ను తీసుకున్న వారి శరీరంలో ఉత్పన్నమయ్యే యాంటీ బాడీస్ అత్యంత సమర్థంగా ఉన్నట్లుగా ఈ జర్నల్ పేర్కొంది.
ఒక డోసు వ్యాక్సిన్ తో హెచ్ ఐవీ రోగుల్లో వైరస్ తటస్థీకరించేలా చేయటంలో శాస్త్రవేత్తలు సక్సెస్ అయినట్లుగా చెబుతున్నారు. తొలి దశలో సాధించిన ఈ విజయం నేపథ్యంలో.. అతి త్వరలోనూ పూర్తిస్థాయి చెక్ పెట్టేలా ఇంజెక్షన్ సిద్ధం కావొచ్చని చెబుతున్నారు. టెల్ అవీవ్ వర్సిటీకి చెందిన న్యూరో బయాలజీ.. బయో కెమిస్ట్రీ.. బయో ఫిజిక్స్ శాస్త్రవేత్తల టీం నిర్వహించిన పలు పరిశోధనల అనంతరం ఈ వ్యాక్సిన్ ను సిద్ధం చేశారు.
సాధారణంగా మనిషి శరీరంలోని వైరస్.. బ్యాక్టీరియాలను నిర్వీర్యం చేసే యాంటీ బాడీలు ఉత్పత్తి కావాలంటే బీ సెల్స్ ఉండాలి. అవి వైరస్ తో పోరాడి వాటిని విభజిస్తాయి. ఫలితంగా వైరస్ మార్పులపైనా పోరాడి వాటిని నిర్వీర్యం చేస్తాయి. తాజా వ్యాక్సిన్ ప్రయోగం.. ఎయిడ్స్ మీద సాగుతున్న సుదీర్ఘ పోరులో పెద్ద ముందడుగుగా అభివర్ణిస్తున్నారు. ఈ ప్రయోగం అందించిన విజయంతో త్వరలోనే ఎయిడ్స్ కు పక్కా ఔషధాన్ని తయారు చేసే రోజు దగ్గర్లోకి వచ్చేసినట్లుగా చెబుతున్నారు.
This post was last modified on June 16, 2022 4:36 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…