ప్రపంచాన్ని మహమ్మారి కమ్మేసిన వేళ.. యావత్ ప్రపంచం పలు జాగ్రత్తల్ని తీసుకుంటోంది. ఇందులో భాగంగా భౌతిక దూరాన్ని పాటించటం.. ముఖానికి మాస్కులు కట్టుకోవటం.. చేతికి అదే పనిగా శానిటైజర్ వాడటం.. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ముఖానికి మాస్క్ పెట్టుకోకుండా బయటకు వస్తే జరిమానా విధిస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు. ఊరంతా ఒక దారి అయితే.. ఊలిపికట్టది మరో దారన్నట్లుగా ఇప్పుడు యవ్వారం తెర మీదకు వచ్చింది.
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో కొత్త ఉద్యమం ఒకటి షురూ అయ్యింది. ముఖానికి మాస్క్ కట్టుకోమంటారా? మేం కట్టుకోం? ఏం చేస్తారో చేసుకోడంటూ కొత్త వాదనకు తెర తీశారు.. ఆ రాష్ట్ర వాసులు. యాంటీ మాస్క్ పేరుతో మొదలైన ఈ ప్రచారానికి అంతకంతకూ మద్దతు పెరుగుతోంది. దేవుడు మనకు ప్రకృతిని అస్వాదించేందుకు అద్భుతమైన శ్వాస వ్యవస్థను ఇచ్చాడు.. మీరందరి దాన్ని మర్చిపోవాలంటున్నారు.. మాస్కును ధరించని వారందరిని అరెస్టు చేస్తామని చెబుతున్నారు.. ఇదేమీ కమ్యునిస్టు దేశం కాదంటూ మండిపడుతున్నారు.
మాస్కుల్ని ధరించటాన్ని వ్యతిరేకిస్తున్న వారంతా కౌంటీకి హాజరై తమ వాదనల్ని బలంగా వినిపించారు.వారి వాదనల్ని వింటే మెంటలెక్కిపోవాల్సిందే. నేను అండర్ వేర్ వేసుకోను.. మాస్క్ ధరించను.. ఏం చేస్తారో చేయండన్నట్లుగా తేల్చేశారు కమిటీ ముందు తన వాదనను వినిపించారో వ్యక్తి.
మనిషికి శ్వాస తీసుకునే హక్కు ఉందని.. దాన్ని నియంత్రించే అధికారాన్ని ఎవరిచ్చారు? ఎక్కడ దాన్ని తీసుకున్నారు? అంటూ మరొకరు కాస్తంత ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. ఇదేమీ కమ్యునిస్టు రాజ్యం కాదని పలువురు ప్రస్తావించటమే కాదు.. దేవుడు మాత్రమే మనల్ని శాసించగలడని నమ్మకంగా చెప్పుకొచ్చారు మరికొందరు. మాస్కు ధరించటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వాదనల్ని విన్నప్పుడు.. వారి వాదనలో పస సంగతేమో కానీ.. ఇదంతా మన మంచి కోసమే కదా? దానికి ఇంత లొల్లి చేయాల్సిన అవసరం ఏమిటన్న సందేహం మనసులో మెదలక మానదు.
అమెరికాలోని జనాల మాదిరే.. అంత నాగరిక దేశంలో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఆ దేశంలో పాతిక లక్షల కేసులు నమోదు కాగా.. దాదాపు 1.26 లక్షల మంది మహమ్మారి బారిన పడ్డారు. తనను చావమంటే చస్తాను కానీ.. పుట్టుకతో తనకు హక్కుగా వచ్చిన శ్వాస తీసుకునే విషయంలో తమను ఎవరూ నియంత్రించలేరన్న వాదన విన్నంతనే జీర్ణించుకోవటం కష్టంగా అనిపించక మానదు. ఏమైనా ఇలాంటి వాదనల్ని అమెరికావాళ్లు మాత్రమే వినిపించగలరేమో?
This post was last modified on June 26, 2020 4:27 pm
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…