Trends

ఇండియాలో అనుతించిన కరోనా మెడిసిన్స్ ఇవే

కరోనాను పూర్తిగా నివారించే మందు ఇంకా ఎక్కడా కనిపెట్టలేదు. కరోనాకు మందొచ్చేసిందంటూ ఎప్పటికప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ అవన్నీ ఓ మోస్తరుగా వైరస్‌ను తగ్గించేవే తప్ప.. మొత్తంగా వైరస్‌ను పారదోలేవి కావు. గ్లెన్ మార్క్ సంస్థ ఇటీవలే విడుదల చేసిన ‘ఫాబి ఫ్లూ’ సైతం ఇలాంటిదే. కరోనా తక్కువగా, మధ్యస్థంగా ఉన్న రోగులు ఈ మందు వాడితే కోలుకుంటారు. ఐతే ‘ఫాబి ఫ్లూ’తో పాటు మరికొన్ని మందుల గురించి కూడా ఈ మధ్య కాలంలో పెద్ద చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో అసలు ఇండియాలో కరోనా చికిత్సలో భాగంగా మందులేంటి అన్నది ఒకసారి చూద్దాం.

కరోనాకు ఆరంభం నుంచి వాడుతున్న మందు రెండెసివిర్ (Remdesivir). అమెరికాకు చెందిన గిలియాడ్‌ సైన్సెస్‌ తొలుత దీన్ని అభివృద్ధి చేసింది. ఇది ఒక యాంటీ వైరల్‌ డ్రగ్‌. దీన్ని గతంలో ఎబోలా చికిత్సకు ఉపయోగించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని కోవిడ్‌ 19 ఎమర్జెన్సీ పేషెంట్లకు వాడవచ్చని సూచించింది. అలాగే మే 1వ తేదీన యునైటెడ్‌ స్టేట్స్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (USFDA) కూడా ఈ మెడిసిన్‌ ఉపయోగానికి ఆమోద ముద్ర వేసింది. దీన్ని మన దేశంలోనూ ప్రస్తుతం కోవిడ్‌ మధ్యస్థ లక్షణాలు ఉన్నవారు, ఎమర్జెన్సీ పేషెంట్ల చికిత్స కోసం వాడుతున్నారు. హెటిరో గ్రూప్‌ ఈ మెడిసిన్‌ను కోవిఫోర్‌ (Covifor) పేరిట ఇంజెక్షన్‌ రూపంలో అందుబాటులోకి తెచ్చింది. ఒక్కో ఇంజెక్షన్‌ 100 మిల్లీగ్రాముల డోసులో ఉంటుంది. ఒక్క డోసు ధర రూ.5వేల నుంచి రూ.6వేల మధ్య ఉంది.

ఫావిపిరవిర్‌ (Favipiravir) అనే మరో మందును కూడా ఇండియాలో వాడుతున్నారు. జపాన్‌కు చెందిన ఫ్యుజిఫిలిం టోయామా కెమికల్‌ లిమిటెడ్‌ తొలుత దీన్ని తయారు చేసింది. ఇది ఒక యాంటీ ఇన్‌ఫ్లుయెంజా డ్రగ్‌. ఈ మెడిసిన్‌ శరీరంలో వైరస్‌ కణాలు వృద్ధి చెందకుండా చూస్తుంది. కోవిడ్‌ 19 క్లినికల్‌ ట్రయల్స్‌లో ఈ మెడిసిన్‌ 88 శాతం వరకు సత్ఫలితాలను ఇచ్చింది. స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్న కోవిడ్ పేషెంట్ల చికిత్సకు ఈ మెడిసిన్‌ను వాడుతున్నారు.

భారత్‌లో గ్లెన్‌మార్క్‌ ఫార్మాసూటికల్స్‌ ఈ మందునే ఫాబిఫ్లూ (FabiFlu) పేరిట విక్రయిస్తోంది. ఒక్కో ఫాబిఫ్లూ ట్యాబ్లెట్‌ను రూ.103కు విక్రయిస్తున్నారు.
డెక్సామిథసోన్‌ (Dexamethasone) అనే మరో మందు కోవిడ్‌ 19 పేషెంట్లు మృతి చెందే అవకాశాలను తగ్గిస్తుంది. వారి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ కోవిడ్‌పై మరింత మెరుగ్గా పోరాడేందుకు ఈ మెడిసిన్‌ ఉపయోగపడతుంది. దీన్ని వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న కోవిడ్‌ 19 పేషెంట్లకు ఇస్తున్నారు. యూకేలో ఈ డ్రగ్‌ను కోవిడ్‌ పేషెంట్లకు వాడేందుకు ముందుగా అనుమతి ఇచ్చారు. ఈ స్టెరాయిడ్‌ చాలా తక్కువ ధరకే లభిస్తుంది. భారత్‌లో దీని ఇంజెక్షన్‌ ఖరీదు రూ.10 కన్నా తక్కువగానే ఉంది.

ఇక కరోనా సమయంలో ఎక్కువగా చర్చనీయాంశమైన మందు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ (Hydroxychloroquine). భారత్‌లో ముందు నుంచి దీన్ని మలేరియా చికిత్సకు వాడుతున్నారు. ఇది యాంటీ రుమాటిక్‌ డ్రగ్‌గా కూడా పనిచేస్తుంది. ఆర్థరైటిస్‌ ఉన్నవారిలో వాపులు, నొప్పులను తగ్గిస్తుంది. ఈ డ్రగ్‌ కోవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ వ్యాపించకుండా చూస్తుందని తేలింది. దీంతో కోవిడ్‌ చికిత్సకు కూడా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 12 ఫార్మా కంపెనీలు ఈ మెడిసిన్‌ను తయారు చేస్తున్నాయి. ఈ మెడిసిన్‌ ఒక్క ట్యాబ్లెట్‌ ఖరీదు రూ.3గా ఉంది. అమెరికా సహా కొన్ని దేశాలకు ఈ మందును ఎగుమతి చేసింది ప్రభుత్వం.

This post was last modified on June 26, 2020 3:13 pm

Share

Recent Posts

వార‌ణాసి కోసం ఇంకో ద‌ర్శ‌కుడు?

అదేంటి.. వార‌ణాసి సినిమాకు రాజ‌మౌళి ద‌ర్శ‌కుడు క‌దా, ఆయ‌న‌తో పాటు ఈ చిత్రానికి మ‌రో డైరెక్ట‌ర్ ప‌ని చేయ‌డం ఏంటి…

51 minutes ago

నాగార్జున నమ్మకం ఎక్కడ తప్పింది

చిన్న సినిమా వెనుక అగ్ర నిర్మాతలు, హీరోలు ఉండటం వాటికి చాలా పెద్ద బలమవుతుంది. బలగంలో ఎంత గొప్ప కంటెంట్…

4 hours ago

విజయ్ స్థానాన్ని భర్తీ చేస్తాడా?

తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…

7 hours ago

ఇరుముడి… పెద్ద పెద్ద స్టేట్మెంట్లు

త‌మ సినిమాల విడుద‌ల‌కు ముందు మేక‌ర్స్ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వ‌డం మామూలే. కానీ అలాంటి స్టేట్మెంట్లు కొన్ని సినిమాల…

8 hours ago

విశ్వంభర వెళ్తున్న దారి సరైనదేనా

చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…

9 hours ago

యష్ మాటల్లో పరిణితి పని చేస్తుంది

ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…

10 hours ago